Ram Gopal Varma: జయసుధ పై ఆసక్తికర ట్వీట్ చేసిన ఆర్జీవీ.. ఏమన్నారంటే

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన వారిలో అందాల తార జయసుధ(Jayasudha) ఒకరు. అందంతో పటు ఆకట్టుకునే అభినయం జయసుధ సొంతం.. హీరోయిన్ గా నటించిన తర్వాత జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎనో వందల సినిమాల్లో నటించారు.

Ram Gopal Varma: జయసుధ పై ఆసక్తికర ట్వీట్ చేసిన ఆర్జీవీ.. ఏమన్నారంటే
Rgv

Updated on: Apr 12, 2022 | 3:10 PM

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన వారిలో అందాల తార జయసుధ(Jayasudha) ఒకరు. అందంతో పాటు ఆకట్టుకునే అభినయం జయసుధ సొంతం.. హీరోయిన్ గా నటించిన తర్వాత జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎనో వందల సినిమాల్లో నటించారు. హీరోలకు అమ్మ పాత్ర అంటే దర్శకుల మొదటి ఛాయిస్ జయసుధ గారే.. జయసుధ 300లకు పైగా సినిమాల్లో నటించి అలరించారు. వాటిలో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. మిగిలినవన్నీ తెలుగు సినిమాలే రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించారు. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే గతకొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె అనారోగ్య పాలయ్యారంటూ వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈమె సింగర్ గా మారి ఓ పాట పాడారు.

2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు. తాజాగా ఆమె యేసు ప్రభువు పై ఓ పాటను ఆలపించారు. ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పాట పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “దేవుడిని నమ్మని వారు కూడా మీ పాట తర్వాత నమ్మడం మొదలు పెడతారు”. అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా జయసుధ అద్భుతంగా ఆలపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు..

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..

KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..