RGV: జగన్ సూపర్ డూపర్ ఒమేగా స్టార్.. కానీ మన హీరోలు మాత్రం.. ఆర్జీవీ వరుస ట్వీట్స్..

దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన అది సంచలనమే.. ఏ విషయం మాట్లాడినా అది వివాదమే.. ప్రస్తుతం ఏపీలో టికెట్ ధరల వ్యవహారం పై రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్ తో విరుచుకుపడుతున్నారు...

RGV: జగన్ సూపర్ డూపర్ ఒమేగా స్టార్.. కానీ మన హీరోలు మాత్రం.. ఆర్జీవీ వరుస ట్వీట్స్..
Rgv

Updated on: Feb 12, 2022 | 10:27 AM

RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన అది సంచలనమే.. ఏ విషయం మాట్లాడినా అది వివాదమే.. ప్రస్తుతం ఏపీలో టికెట్ ధరల వ్యవహారం పై రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్‌తో విరుచుకుపడుతున్నారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి స్టార్ హీరోలు, దర్శకులు ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Y. S. Jagan Mohan Reddy)ని కలిసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, చిరంజీవి(chiranjeevi ), ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి ఇలా పలువురు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. అలాగే టికెట్ ధరల విషయం పైన కూడా చర్చించారు. టాలీవుడ్ పెద్దల విన్నపాలు విన్న జగన్.. సానుకూలంగా స్పందించారు. జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల చివరిలోగా గుడ్ న్యూస్ వింటారు అని చెప్పారు టాలీవుడ్ బృందం. అయితే ఇప్పుడు ఈ అంశం పై వర్మ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు.

జగన్  ‘రియల్ మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్’ అని వర్మ అన్నారు. మహేశ్ బాబు, చిరంజీవి, ప్రభాస్ తదితరులు ఒమేగా స్టార్ జగన్ చూట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా కూర్చోవడమే దీనికి ఉదాహరణ అని ట్వీట్ చేశారు ఆర్జీవీ. రీల్ ఫిల్మ్ లో ఫ్రేమ్ మధ్యలో మహేశ్, చిరంజీవి, ప్రభాస్ తదితరులు పంచ్ డైలాగులు కొడుతుంటారని.. కానీ రియల్ లైఫ్ లో ఫ్రేమ్ మధ్యలో జగన్ ఉన్నారని అన్నారు. జగన్ కు వారంతా భయపడ్డారని, భిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టుల్లా బెగ్గింగ్ చేశారని ఎద్దేవా చేశారు ఆర్జీవీ. అదేవిధంగా మరో ట్వీట్ లో ముఖ్యమంత్రి ఒమేగా స్టార్ జగన్ ను చూసి ఆశ్చర్యపోయానని… ఎందుకంటే సూపర్ మెగాస్టార్స్ అందరినీ ‘హీరోలు అందరూ జీరోలు’ గా చేసి ఆయన నిరూపించాడని రాసుకొచ్చారు వర్మ. ఈ ట్వీట్స్ పై టాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

DJ Tillu Twitter Review: దుమ్మురేపుతున్న డీజే టిల్లు.. ట్విట్టర్‌లో రీసౌండ్

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Alia Bhatt Interview: సంజయ్ సర్ పెట్టిన రూల్‏ను బ్రేక్ చేయాలనుకోలేదు.. ఆలీయా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు..