
ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న ‘వార్ 2’ చిత్రం టీజర్ మంగళవారం (మే20) విడుదలైంది. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ సినిమాకు సీక్వెల్ ఇది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతోవార్ 2 మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది సినీ అభిమానులను ఎంత గానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వార్ 2 టీజర్ ను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లతో పాటు కియారా అద్వానీ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నిన్న రిలీజైన టీజర్ లో కూడా కియారా లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె కనిపించింది కొన్ని సెకన్లే అయినా టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఇందుకు కారణం కియారా మొదటి సారిగా బికినీ ధరించి కనిపించడమే. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ లతో పాటు కియారా లుక్ కూడా ఇప్పుడు హైలెట్ గా నిలిచిందంటున్నారు ఫ్యాన్స్. కాగా ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వార్ 2 మూవీలో కియారా లుక్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఆర్జీవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద పోస్టులు లేదా ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆయన తన వ్యాఖ్యల కారణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో కియారా బికినీ ఫోటోలను షేర్ చేసి, వాటిపై అసభ్యకరమైన క్యాప్షన్ రాశాడు. హృతిక్ రోషన్. జూనియర్ ఎన్టీఆర్ లను కియారాతో లింక్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రామ్ గోపాల్ వర్మపై ఓ రేంజ్ లో మండి పడ్డారు. ‘సోషల్ మీడియాలో మీరు ఏమి రాస్తున్నారో మీకైనా తెలుసా?’ అంటూ నెటిజన్లు ఆర్జీవీని ఒక ఆట ఆడుకున్నారు. దీనిని గ్రహించిన రామ్ గోపాల్ వర్మ చివరకు తన పోస్ట్‌ను తొలగించారు. కానీ దాని స్క్రీన్ షాట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
&
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.nbsp;