Rajamouli-Ram Gopal Varma: రాజమౌళిపై హిందూ సంఘాల మాటల దాడి.. ఆర్జీవీ సంచలన ట్వీట్.. అలా అనేశాడేంటి?

వారణాసి సినిమా ఈవెంట్‌లో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను దేవుళ్లను నమ్మనంటూ జక్కన్న చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇప్పుడీ వివాదంలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తలదూర్చాడు

Rajamouli-Ram Gopal Varma: రాజమౌళిపై హిందూ సంఘాల మాటల దాడి.. ఆర్జీవీ సంచలన ట్వీట్.. అలా అనేశాడేంటి?
Rajamouli, Ram Gopal Varma

Updated on: Nov 21, 2025 | 6:18 PM

రాజమౌళి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు విరుచుకుపడుతన్న నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేలా ఉంది. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ఏం రాసుకొచ్చారంటే.. ‘నాస్తికుడైన రాజమౌళిపై భక్తులమని చెప్పుకుంటున్న కొందరు అదే పనిగా విషం చిమ్ముతున్నారు. అలాంటి వారందరు ఒకటి తెలుసుకోవాలి. మన దేశంలో నాస్తికుడిగా ఉడటం తప్పుకాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో ఏం చెప్తుందంటే నమ్మకుండా ఉండే హక్కు కూడా మనకు ఉంది. కాబట్టి ఆ విషం కక్కేవాళ్లకి నమ్మకం ఉందని చెప్పే హక్కు ఎంత ఉందో.. ఆయనకు (రాజమౌళికి) నమ్మకం లేదని చెప్పే హక్కు కూడా అంతే ఉంది. దేవుడిని నమ్మకపోతే, తన సినిమాల్లో దేవుడిని ఎందుకు ప్రాధాన్యత గా తీసుకుంటున్నాడు? అని ప్రశ్నిస్తున్నారు కదా. ఈ లెక్కన చూస్తే ఒక దర్శకుడు గ్యాంగ్ స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్‌ స్టర్‌ అవ్వాలా? హారర్‌ సినిమా తీయాలంటే అతడు దెయ్యం అవ్వాలా?’ ‘మీ అందరికి తెలియని షాకింగ్‌ నిజమేంటంటే రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా.. తన సినిమాల ద్వారా ఎంతోమందిలో భక్తి నింపుతున్నారు. మరో షాకింగ్ నిజం ఏంటంటే? రాజమౌళి దేవుడ్ని నమ్మకపోయినా చాలామంది భక్తులు జన్మల్లో కూడా చూడనంత విజయాన్ని, డబ్బును, అభిమానం దేవుడే ఈయనకు వంద రెట్లు ఎక్కువ ఇచ్చాడు’..

‘కాబట్టి మీరంత గ్రహించాల్సిన విషయం ఏంటంటే.. దేవుడికి కి భక్తులకంటే నాస్తికులే ఇష్టం. లేదంటే ఆయన ఇవన్ని పట్టించుకోరేమో. పైన కూర్చుని ఎవరూ నమ్ముతున్నారు.. ఎవరూ నమ్మడం లేదో నోట్‌ చేసుకోవడం లేదేమో! మరి దేవుడికే ఆయనతో సమస్య లేనప్పుడు. ఈ స్వయం ప్రకటిత దేవుడి దళారులకు బీపీ, అల్సర్లు ఎందుకొస్తున్నట్టు?. నిజానికి ఇక్కడ అసలు సమస్య ఆయన నాస్తికకుడి అని కాదు. అతను దేవుడిని నమ్మకుండానే విజయం సాధించాడు. కానీ, భక్తులమంటూ దేవుడిని పిచ్చిన ఆరాధిస్తున్న వారిలో ఇలాంటి విజయం లేదు. వారంత ఫెయిల్ అవుతున్నారనే భయం వారిని పట్టుకుంది. రాజమౌళి నాస్తికుడు అయినంత మాత్రాన దేవుడు తగ్గిపోడు. నిజం ఏమిటంటే రాజమౌళి నాస్తికుడు కావడం వల్ల దేవుడు తగ్గడు. రాజమౌళి బాగానే ఉన్నాడు. ఆ దేవుడు బాగానే ఉన్నాడు. బాధపడేది ఎవరంటే వీరిద్దరిని అర్థం చేసుకోలేని జనం మాత్రమే. అందుకే వారణాసి సినిమాతో దేవుడు మరోసారి రాజమౌళిని నిండుగా ఆశీర్వదించబోతున్నాడు. ఓ సూపర్‌ బ్లాక్ బస్టర్‌, భారీ కలెక్షన్స్‌తో ఆయన బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ని మరింత పెంచబోతున్నాడు. ఇది చూసి ఓడిన వాళ్లంత అసూయతో ఏడుస్తూ ఉండొచ్చు. చివరిగా చెప్పేదేంటంటే.. ఇది దేవుడిపై నమ్మకంలా నటించే పిచ్చి అసూయ మాత్రమే. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించండి. ఆయనపై విషాన్ని చిమ్మడం ఆపండి.. జై శ్రీరామ్‌’ అని సుదీర్ఘమైన వివరణ రాసుకొచ్చారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సంచలనం రేపుతుంది. వర్మ కామెంట్స్‌ పై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆర్జీవీ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.