
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత రామ్‌చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో ‘గేమ్ ఛేంజర్’ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ దర్శకత్వం వహిస్తుండడంతో ఆ అంచనాలు మరింత తారస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ కు లీకుల బెడద తప్పడం లేదు. వీటిని అరికట్టేందుకు ఈ సినిమా షూటింగ్‌లో చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా కూడా లీకుల బెడద ఆగడం లేదు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ సెట్ నుండి మరి కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో రామ్ చరణ్ పాత్ర లుక్ కూడా రివీల్ అయింది . ఈ ఫోటో అభిమానుల పేజీల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. వీడియోలో ఫుల్ ఫ్రొఫెషనల్‌గా కనిపించాడు చెర్రీ. ఇది చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లుక్ సూపర్బ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
రాజకీయాల ‘గేమ్ ఛేంజర్’ సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ అంటే సహజంగానే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇటీవలే మైసూర్ షెడ్యూల్ కూడా పూర్తయింది. . ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విన్నింగ్ ట్రాక్‌ని కొనసాగించాలంటే ‘గేమ్ ఛేంజర్’ హిట్ అవ్వాల్సిందే. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జే సూర్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Carnage in Vizag 🔥🔥🔥🔥
One and only MASS GOD @AlwaysRamCharan 🛐#RAMCHARANAtHisFortVIZAG pic.twitter.com/P5vomRb9H2— Team RamCharan Vizag (@TeamRC_Vizag) March 15, 2024
Vizag Lo Charan Babu 🩷👌 pic.twitter.com/haMgxuyV2C
— Hari SaaHo (@HariSaaho19) March 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.