Upasana Kamineni: పిల్లల్ని కనడానికి అందుకే టైం తీసుకున్నాం.. ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్

క్లిం కార తమ ఫ్యామిలీ లోకి రావడంతో మెగాస్టార్ కుటుంబానికి బాగా కలిసొచ్చింది అంటున్నారు. రామ్ చరణ్  సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం. రీసెంట్ గా చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడం తెలిసిందే. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు. చరణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు ఉపాసన కూడా అపోలో హాస్పటల్ బాధ్యతలను నిర్వహిస్తూ బిజీ అయ్యారు.

Upasana Kamineni: పిల్లల్ని కనడానికి అందుకే టైం తీసుకున్నాం.. ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ram Charan, Upasana

Updated on: Feb 06, 2024 | 4:07 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పాపకు జన్మనించిన విషయం తెలిసిందే. చరణ్ దంపతులు పెళ్ళై దాదాపు 10 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. ఆ పాపకు క్లింకార అనే పేరు పెట్టారు. క్లిం కార తమ ఫ్యామిలీ లోకి రావడంతో మెగాస్టార్ కుటుంబానికి బాగా కలిసొచ్చింది అంటున్నారు. రామ్ చరణ్  సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం. రీసెంట్ గా చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడం తెలిసిందే. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు. చరణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు ఉపాసన కూడా అపోలో హాస్పటల్ బాధ్యతలను నిర్వహిస్తూ బిజీ అయ్యారు. తాజాగా ఓ బుక్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఉపాసన. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తన భర్త రామ్ చరణ్ తో బాండింగ్ గురించి.. అలాగే తన కూతురు క్లింకార గురించి తెలిపారు ఉపాసన. పెళ్ళైన పదేళ్ల తర్వాత తల్లి అయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు.? అన్న ప్రశ్నకు ఉపాసన సమాధానం చెప్తూ.. తల్లి కావడం గ్రేట్ అని అంటుంటారు.. కానీ నేను డబుల్ గ్రేట్ అని చెప్తాను అని అన్నారు ఉపాసన.

పెళ్ళై ఇన్నేళ్లు అవుతుంది ఇంకెప్పుడు పిల్లలను కంటారు అని చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ మాటలు నా వరకు కూడా వచ్చాయి. అంతే కాదు ఏమైనా సమస్య ఉందా.? అని కూడా మాట్లాడుకున్నారు అని కూడా మాట్లాడుకున్నారు. మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పడే పిల్లలను కనాలి అని అనుకున్నాం. అందుకే ఇంతకాలం పట్టింది అని తెలిపారు ఉపాసన. రామ్ ఎప్పుడూ కూడా ‘ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం’ అంటుంటాడు. మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటాం.., గౌరవించుకుంటాం. మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయి. ఒకరి కెరీర్ లో ఒకరు ఇవాల్వ్ అవ్వం.. వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఒక్కటిగా ఉంటాం అని తెలిపారు ఉపాసన.

ఉపాసన కొణిదెల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఉపాసన కొణిదెల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.