- Telugu News Photo Gallery Cinema photos A new type of discussion in film circle is how much minutes the heroes is on screen
Heroes Screen Space: తెర మీద హీరోలు ఇన్ని నిమిషాలు మాత్రమే కనిపించారా.. నయా డిస్కషన్..
మా హీరో స్క్రీన్ స్పేస్ ఎంత? మీ హీరో తెర మీద ఎన్ని నిమిషాలు కనిపించారు? ఇప్పుడు సినిమా సర్కిల్స్ లో ఇదో కొత్త తరహా డిస్కషన్. పవన్ కల్యాణ్ సినిమాలతో మొదలైన ఈ డిస్కషన్, సలార్ చూశాక కంటిన్యూ అయింది. ఫ్యూచర్‌లో ఈ చర్చల్లో కనిపించబోయే సినిమాలేంటి? కమాన్ లెట్స్ వాచ్
Updated on: Feb 06, 2024 | 4:16 PM

ఓ వైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు, ఈ వర్క్ షీట్ బ్యాలన్స్ కావాలంటే కాల్షీట్ పంపకాలు కరెక్ట్ గా ఉండాలి. అలా ప్లాన్ చేసుకున్న పవన్ కల్యాణ్ ఈ మధ్య చేసిన సినిమాల్లో స్క్రీన్ స్పేస్ కాస్త తగ్గినా ఫర్వాలేదనుకున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, రీసెంట్ సినిమా బ్రోలోనూ అలాగే కనిపించారు పవన్ కల్యాణ్. నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఓజీలో పవర్‌స్టార్ కేరక్టర్ నిడివి ఎంత ఉండవచ్చు అనేదాని మీదా ఇంట్రస్టింగ్ డిస్కషనే జరుగుతోంది.

పవన్ కల్యాణ్ సినిమా విషయంలోనే కాదు, ప్రభాస్ విషయంలోనూ ఈ మాటే మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. నా కెరీర్‌లో అత్యంత కంఫర్ట్ గా అనిపించిన డైరక్టర్ వి.వి.వినాయక్. ఆయన్ని మించేలా నన్ను గొప్పగా చూసుకున్న డైరక్టర్ ప్రశాంత్‌నీల్ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు ప్రభాస్. సలార్ సినిమా చూసిన వాళ్లు ప్రశాంత్‌ని డార్లింగ్ పొగడటంలో తప్పేమీ లేదన్నారు.

స్క్రీన్ మీద పట్టుమని పది డైలాగులు కూడా డార్లింగ్‌కి లేవన్నది సలార్ విషయంలో ప్రధానంగా వినిపించిన కంప్లయింట్. సలార్ ఫస్ట్ పార్టులో ఎన్విరాన్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కే ఎక్కువ టైమ్ తీసుకున్నారు ప్రశాంత్‌నీల్.

మరి అమితాబ్, కమల్‌హాసన్‌లాంటి హేమాహేమీలున్న కల్కి విషయంలోనూ ఇలాంటి కంప్లయింటే మళ్లీ వినిపిస్తుందా? లేకుంటే డైనోసార్ ఆర్టిస్ట్ కి నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన స్క్రీన్ స్పేస్ భారీగా ఉంటుందా?

స్క్రీన్ స్పేస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, దేవర విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. దేవర కూడా రెండు పార్టులుగా విడుదల కానుంది. నార్త్ నుంచి సైఫ్, జాన్వీ ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యారు. భయం అన్నది ఎరుగని వాళ్లకు భయం పుట్టించే వ్యక్తి కథ కావడంతో తారక్‌కి మంచి స్పేస్ ఉంటుందా? లేకుంటే కథ మొత్తం సెకండాఫ్‌లో చెబుదామని, ఫస్టాఫ్ లో మిగిలిన కేరక్టర్ల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారా? అనే డిస్కషన్ కూడా షురూ అయింది.




