Upasana Kamineni Konidela: రెండు సింహాలను దత్తత తీసుకున్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన..

|

Dec 04, 2021 | 7:07 PM

మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగ పరిచయం చేయాల్సిన పనిలేదు. అపోలో ఆసుపత్రి బాధ్యతలు

Upasana Kamineni Konidela: రెండు సింహాలను దత్తత తీసుకున్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన..
Follow us on

మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగ పరిచయం చేయాల్సిన పనిలేదు. అపోలో ఆసుపత్రి బాధ్యతలు చేపడుతూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఉపాసన. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. ఫిట్‏నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ.. వీడియోస్ షేర్ చేస్తుంటారు. జంతువులు, పక్షుల సంరక్షణకు సంబంధించిన విషయాలను.. వాటి జాగ్రత్తలు గురించి తన సోషల్ మీడియా ఖాతాలలో ఎక్కువగా షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా ఉపాసన రెండు సింహాలను దత్తత తీసుకున్నారు.

హైదరాబాద్‏లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‏లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకున్నారు. ఆ రెండు సింహాలను సంరక్షణ బాధ్యతలు.. ఆహారపు ఖర్చులను సంవత్సరంపాటు ఉపాసన కొణిదెల చూసుకోనున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‏కు అందించారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. క్యూరేటర్.. అతని టీంసభ్యులను ఉపాసన అభినందించారు. జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు.. జూలో సరైన పరిశుభ్రతను నిర్వహించడంలో సిబ్బంది అంకితభావం.. జంతువుల కోసం జూ నిర్వహకులు చేస్తున్న సేవకు వారిని ప్రశంసించారు.

Upasana Kamineni

అనంతరం.. ఈ సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ శ్రీ ఎస్. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉపాసన కొణిదెల మంచి మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. జూ పార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ఒక సంవత్సరం పాటు సింహాల జతను దత్తత తీసుకోవడానికి ఉపాసన కామినేని కొణిదెల, అనుష్పలా కామినేని ఆసక్తి చూపించారు. వన్యప్రాణుల పరిరక్షణ కోసం వారి నిబద్ధత చాలా మందికి స్ఫూర్తిదాయకమన్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి మరింత మంది పౌరులు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దత్తత కార్యక్రమంలో Dy. క్యూరేటర్ శ్రీమతి A. నాగమణి , శ్రీ హెచ్.ఎం. హనీఫుల్లా, పి.ఆర్.ఓ పాల్గొన్నారు.

Also Read: Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..’

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..