Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!

సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు కోకొల్లలు. ఏదైనా చిన్న అకేషన్ వస్తే చాలు.. ఇలా ఫోటోలు అప్‌లోడ్ చేస్తుంటారు...

Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine
Follow us

|

Updated on: Dec 04, 2021 | 7:17 PM

సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు కోకొల్లలు. ఏదైనా చిన్న అకేషన్ వస్తే చాలు.. ఇలా ఫోటోలు అప్‌లోడ్ చేస్తుంటారు. ఇక వాటిని ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేసేస్తారు. ఇదిలా ఉంటే.. నెట్టింట ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. ‘త్రోబ్యాక్ ధర్స్‌డే’ వచ్చిందంటే.. హీరోయిన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ పలు చైల్డ్‌హుడ్ ఫొటోస్ షేర్ చేస్తారు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

రెండు పిలకలు వేసుకుని చక్కగా ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు తెలుగునాట క్రేజీ హీరోయిన్. తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. మొదటి సినిమాతోనే అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది. ఎవరో గుర్తుపట్టారా.? ఈమె నటించిన తొలి చిత్రానికి దర్శకుడు అజయ్ భూపతి.. కనిపెట్టేశారా.? ఆమెవరో కాదండీ పాయల్ రాజ్‌పుత్.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. ఆ సినిమాలో నటనకు గానూ మంచి మార్కులు తెచ్చుకుంది. అంతేకాకుండా బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్టరస్‌గా సైమా అవార్డును కూడా దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తమిళ, పంజాబీ, కన్నడ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి:

పడగవిప్పి కోపంతో రగిలిపోతున్న భారీ నాగుపాము చూశారా.? వెన్నులో వణుకు పుట్టించే వీడియో మీకోసమే!

17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!

అటకపై అనుకోని అలజడి.. ఎలుక అనుకుని వెళ్లి చూడగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!