AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi : తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈసినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరవాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Peddi : తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్..
Peddi New
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2026 | 6:14 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఏవైటింగ్ మూవీ పెద్ది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న అంటే రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా ఖచ్చితంగా సంచలన విజయం సాదిస్తుందని అభిమానులు చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్, ట్రైలర్ చూస్తుంటే పెద్ది సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుంది. అలాగే శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు సన చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. పైగా చరణ్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించనుండటంతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి.

కాగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు గుడ్ న్యూస్ చెప్పాయి. టికెట్ ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటిగా ఏపీ.. జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోలకుఅనుమతి ఇచ్చింది. సినిమా విడుదలైన వారం రోజుల పాటు రోజుకు 5 షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకోవచ్చు. అలాగే ప్రీమియర్ షోలకు కూడా టికెట్ రేట్ ను ఫిక్స్ చేసింది. ప్రీమియర్స్ కు రూ. 600 పిక్స్ చేసింది.

అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ది టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. స్పెషల్ షోలు ప్రభుత్వ ఉత్తర్వులు జరీ చేస్తూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 100, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ. 125 పెంచుకునేందుకు వీలు కల్పించారు. ప్రీమియర్ షోలు జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి  ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్ఠంగా రూ. 600 (GSTతో కలిపి) గా నిర్ణయించారు. దీనితో పాటు సినిమా విడుదలైన మొదటి పది రోజులు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. జూన్ 4వ తేదీ నుండి 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉండనున్నాయి. కాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ది టికెట్స్ ధరలు పెంచడంతో పాటు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడంతో రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరుకు ట్విట్టర్( ఎక్స్) లో  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమాట రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి కందుల దుర్గేష్ కు ధన్యవాదాలు తెలిపారు చరణ్.

ఇవి కూడా చదవండి
Ram Charan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us