Puri Jagannath: మరోసారి ఆ మెగా హీరోతో డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ సినిమా.. ఫ్యాన్స్ కు పూనకాలే..

టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులున్న తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు పూరీజగన్నాథ్.  పూరీని డాషింగ్ డైరెక్టర్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్..

Puri Jagannath: మరోసారి ఆ మెగా హీరోతో డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ సినిమా.. ఫ్యాన్స్ కు పూనకాలే..
Puri Jagannath

Updated on: Jun 07, 2021 | 3:26 PM

Puri Jagannath: టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులున్న తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు పూరీజగన్నాథ్.  పూరీని డాషింగ్ డైరెక్టర్ గా ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. ఆయన సినిమాలోని డైలాగ్ లు హీరో క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. పూరీ జగన్నాథ్ సినిమాలంటే ముఖ్యంగా గుర్తొచ్చేది మాస్. మాస్ ఆడియన్స్ కు కావాల్సినంత స్టాఫ్ పూరీ సినిమాల్లో ఉంటుంది. దాదాపు అందరు హీరోలు పూరీజగన్నాథ్ తో సినిమా చేయడానికి ఇష్టపడుతుంటారు. చాలా కాలాంతర్వత ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. అప్పటి వరకూ లవర్ బాయ్ గా పేరున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ను ఈ సినిమాతో మాస్ హీరోను చేసాడు. ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే జోష్ లో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు  నటి ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉంటే త్వరలో పూరీ జగన్నాథ్ ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ ఎవరో కాదు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీజగన్నాథే. పూరీ తెరకెక్కించిన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు చరణ్. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటుగా ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఫైనల్ స్టేజీకి రావడంతో చరణ్ తదుపరి ప్రాజెక్ట్ ని ఇటీవలే ప్రకటించారు. దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు చరణ్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  అయితే ఇండియన్ 2 వివాదం కారణంగా శంకర్ సినిమా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. దాంతో ఈ గ్యాప్ లో పూరీ తో సినిమా చేయాలనీ చూస్తున్నాడట చరణ్. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Srihari: డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి బాల్కానీ నుంచి విసిరేసేవారు.. శ్రీహరి గొప్పతనం గురించి చెప్పిన స్టార్ కమెడియన్..

Nikhil: పది లక్షలకు పైగా బిల్లులా ?.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ? హస్పిటల్ బిల్లులపై హీరో నిఖిల్ ఆగ్రహం..