మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రీతోపాటు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇందులో అలీయా భట్.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటుంది. అలాగే చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.. తమిళ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు… ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ అధికారిక ప్రకటనతోపాటు చరణ్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం గౌతమ్.. హిందీలో జెర్సీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఇందులోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. అలాగే చరణ్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.
ట్వీట్…
A combination I’m definitely looking forward to! @gowtam19 @UV_Creations @NVRCinema #RCwithGowtam https://t.co/OEfOUIs5xY
— Ram Charan (@AlwaysRamCharan) October 15, 2021
Also Read : Mahesh Babu: పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్న మహేష్.. క్లారిటీ ఇచ్చిన ప్రిన్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..
Naveen Chandra: ‘తగ్గేదే లే’ అంటున్న నవీన్ చంద్ర.. ఆసక్తికరంగా టీజర్ విడుదల