Ram Charan: హాలీవుడ్ ఎంట్రీపై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్.. దర్శకులకు ఆ కండీషన్ ఉంటుందట..

|

May 23, 2023 | 3:38 PM

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సదస్సులో చరణ్ స్పీచ్ కు అభిమానులే కాదు.. భారతీయులంతా ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదే వేదికపై చరణ్ తన హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Ram Charan: హాలీవుడ్ ఎంట్రీపై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్.. దర్శకులకు ఆ కండీషన్ ఉంటుందట..
Ram Charan
Follow us on

ప్రస్తుతం వరల్డ్ వైడ్‏గా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా కాశ్మీర్‍లో జరిగిన జీ20 సమ్మిట్‏కు ప్రతినిధిగా హజరయ్యి భారతీయ సినిమా మరోసారి గర్వపడేలా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సదస్సులో చరణ్ స్పీచ్ కు అభిమానులే కాదు.. భారతీయులంతా ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదే వేదికపై చరణ్ తన హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

చరణ్ మాట్లాడుతూ.. “ఇండియాలో ఎంతో అందమైన లొకేషన్స్ ఉన్నాయి. కశ్మీర్ లాంటి ప్రాంతంలో ఈ సదస్సు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కేరళ, కశ్మీర్.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో ప్రకృతి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలాంటి లోకేషన్లు షూటింగ్ కు బాగుంటాయి. వీటన్నింటిని నేను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. అందుకే నేను నటించనున్న చిత్రాల షూటింగ్స్ ఎక్కువగా ఇండియాలోనే జరపాలని కోరుకుంటున్నాను. కేవలం లోకేషన్స్ కోసం ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటున్నను. నేను హాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ ఆ దర్శకులు కూడా ఇండియా అందాలను చూపిస్తాను.. వాళ్లను ఇక్కడికి రమ్మని షరతు పెడతాను. నార్త్, సౌత్ అనే రెండు రకాల సినిమాలు లేవు.. ఉన్నది భారతీయ సినిమా ఒక్కటే. ఇప్పుడు ఇది గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది” అని అన్నారు.

అలాగే తన కెరీర్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రత్యేకస్థానం ఉందని.. జపాన్ లో ఈ సినిమాను ఎంతో ఆదరించారని.. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అక్కడి వెళ్లినప్పుడు ప్రజలు మాతో ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. జపాన్ నాకు, నా భార్యకు చాలా ప్రత్యేకమైనది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల. తనని ఇప్పుడు జపాన్ టూర్ వెళ్దామని అడిగినా ఓకే అంటుంది అంటూ చెప్పుకొచ్చారు చరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.