Ram Charan : కరోనా వైరస్‌తో రెండు సంవత్సరాలుగా జనాలు ఎంత ఇబ్బందిపడుతున్నారో అందరికి తెలిసిందే. చాలామంది ఉద్యోగులు జాబులు పోగొట్టుకొని నిరుద్యోగులుగా మారారు. కంపెనీలు స్టాఫ్‌ని తగ్గించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులకు గిరాకీ లేకపోవడంతో రోజు గడవడమే గగనంగా మారింది. సెకండ్ వేవ్ తర్వాత కొంత ఉపశమనం దొరికినా వేతన జీవులు చాలామంది ఆర్థికంగా చితికిపోయారు. ఇలాంటి పరిస్థితులలో సెలబ్రిటీలు, సినీ నటుల దగ్గర పనిచేసే స్టాఫ్‌కి మాత్రం కరోనా ఎఫెక్ట్ నుంచి మినహాయింపు దొరికింది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.
ఈ విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ గురించే.. ఈ కుటుంబంలో ఉద్యోగం దొరికిందంటే ఇక వారి జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కరోనా టైంలో కూడా అందరిని సొంతవారిలా చూసుకున్నారు. పండుగలకు, పబ్బాలకు బోనస్‌లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. వారి దగ్గర పనిచేసే వారందరికి మంచి జీతాలు చెల్లిస్తారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డ్రైవర్ జీతం సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. నెలకు రూ.45 వేలకు పైగా ఇస్తాడని తెలిసింది.
ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఇచ్చే జీతం చెల్లిస్తున్నాడంటే చెర్రీ తన దగ్గర పనిచేసే వాళ్లను ఎలా చూసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చరణ్ ఎస్‌ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఈ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇక మెగాస్టార్ ఆచార్య పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి.