Ram Charan: నాగ్ అశ్విన్.. ఇది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్ చేస్తున్నా.. రామ్ చరణ్ వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 35 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని శుక్రవారం మే 9న రీరిలీజ్ చేశారు మేకర్స్. కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

Ram Charan: నాగ్ అశ్విన్.. ఇది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్ చేస్తున్నా.. రామ్ చరణ్ వీడియో వైరల్..
Ram Charan, Nag Ashwin

Updated on: May 09, 2025 | 10:53 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 35 ఏళ్లు అవుతుండగా.. శుక్రవారం ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేశారు. తాజాగా చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ కలిసి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ వీడియో షేర్ చేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. అలాగే ఈ సినిమా సీక్వెల్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఆ వీడియో రామ్ చరణ్ మాట్లాడుతూ.. “మా తరానికి అసలు సిసలు సోషియో ఫాంటసీ సినిమా అంటే జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రంలోని జై చిరంజీవా జగదేక వీర అనే సాంగ్ చూసిన తర్వాతే నాకు ఆంజనేయుడి మీద భక్తి మొదలైనట్లుగా గుర్తుంది. ఇది డ్రీమ్ టీం అని మా తరం మొత్తం నమ్ముతుంది. ఎందుకంటే చిరంజీవి గారు.. రాఘవేంద్రగారు.. శ్రీదేవి గారు.. అశ్వినీదత్ గారు.. ఇళయారాజా గారు.. యండమూరి గారు.. పరుచూరిగారు.. విన్సెంట్ గారు.. ఇలా లెజెండ్స్ అందరూ కలిసి ఈ సినిమా కోసం పనిచేశారు. మళ్లీ ఆ టీం అంతా కలిసి పనిచేయలేదు. ఇక ఈ సినిమా చివర్లో చూపించినట్లుగా ఆ రింగు ఏమైంది.. ? ఆ చేప ఎక్కడుంది ? అనే విషయాలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది రిక్వెస్ట్ కాదు.. మా డిమాండ్ ” అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. మరీ చరణ్ డిమాండ్ పై నాగ్ అశ్విన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన చరణ్.. ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ తీయాల్సి వస్తే.. రామ్ చరణ్, జాన్వీ జంటగా ఉండాలని.. అశ్వనీదత్ పిల్లలు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అన్నారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..