Ram Charan-Upasana: ‘డబుల్ ధమాకా’ అంటూ మరో గుడ్‌న్యూస్ చెప్పిన ఉపాసన తల్లి.. మెగా ఫ్యాన్స్ సంబరాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం చరణ్ భార్య ఉపాసన గర్భంతో ఉంది. తాజాగా ఆమెకు ఘనంగా సీమంతం నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ ఆనందంలో ఉండగానే మరో గుడ్ న్యూస్ చెప్పింది ఉపాసన తల్లి శోభన కామినేని.

Ram Charan-Upasana: డబుల్ ధమాకా అంటూ మరో గుడ్‌న్యూస్ చెప్పిన ఉపాసన తల్లి.. మెగా ఫ్యాన్స్ సంబరాలు
Ram Charan, Upasana

Updated on: Oct 23, 2025 | 7:32 PM

మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన మరోసారి అమ్మానాన్నలు కాబోతున్నారు. తాజాగా ఉపాసనకు సీమంతం ఘనంగా నిర్వహించారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు కామినేని కుటుంబీకులు ఈ సీమంతం వేడుకకు హాజరయ్యారు. రెండోసారి తల్లిగా ప్రమోషన్ పొందనున్న ఉపాసనను అశీర్వదించారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్- ఉపాసన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ ఆనందంలో తేలుతుండగానే మరో గుడ్ న్యూస్ చెప్పింది ఉపాసన తల్లి శోభనా కామినేని. రామ్ చరణ్‌-ఉపాసనలు ట్విన్ బేబీస్ కు పుట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘దీపావళి కచ్చితంగా మాకు ఒక సంతోషకరమైన డబుల్ ధమాకా ఇచ్చింది! అనిల్, నేను వచ్చే ఏడాది ఉపాసన- రామ్ చరణ్ కవలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరం సంతోషంగా, ప్రకాశవంతంగా మారింది’ అంటూ పోస్ట్ పెట్టింది శోభన కామినేని. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన మెగాభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్- ఉపాసనలకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

కాగా ఉపాసన సీమంతం వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. హీరో వెంక‌టేష్ త‌న సతీమ‌ణితో క‌లిసి ఈ వేడుక‌కు రాగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీ సైతం సందడి చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, నాగబాబు, లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్, పవన్ కల్యాణ్ సతీమణి ఉపాసన సీమంతం వేడుకలో పాల్గొన్నారు. అలాగే లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార కూడా త‌న భ‌ర్త విఘ్నేశ్ శివన్, పిల్ల‌ల‌తో క‌లిసి ఈ ఫంక్షన్ కు హాజ‌రైంది.

ఇవి కూడా చదవండి

ఉపాసన సీమంతం వేడుక.. వీడియో ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్.  ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.  ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి