Ram Charan: దటీజ్ రామ్ చరణ్, ఉపాసన.. 500కుపైగా కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మెగా కపుల్

|

Jul 07, 2024 | 11:00 AM

చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు.. ఇలా మెగా హీరోలు గతంలో చాలామందికి ఆపన్న హస్తం అందించారు. ఆ తర్వాతి తరంలో వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరిష్ కూడా ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు ఆపన్న హస్తం అందించిన రోజులు ఉన్నాయి

Ram Charan: దటీజ్ రామ్ చరణ్, ఉపాసన.. 500కుపైగా కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మెగా కపుల్
Ram Charan, Upasana
Follow us on

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు మెగా హీరోలు ఒక్క అడుగు ముందే ఉంటారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు.. ఇలా మెగా హీరోలు గతంలో చాలామందికి ఆపన్న హస్తం అందించారు. ఆ తర్వాతి తరంలో వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరిష్ కూడా ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు ఆపన్న హస్తం అందించిన రోజులు ఉన్నాయి. తాజాగా చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 500 కుటుంబాలకు సహాయం అందించాడు. ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసనలను ప్రత్యేకంగా కలిశాడు జానీ మాస్టర్. ఈ సందర్భంగానే డ్యాన్సర్స్‌ యూనియన్‌లోని 500 కుటుంబాలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో సాయం చేస్తామని జానీ మాస్టర్ కు మాటిచ్చారు రామ్ చరణ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు జానీ మాస్టర్.

‘సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాను. అక్కడికి వెళ్లాక మెగాస్టార్ చిరజీవి గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న ఉపాసన కొణిదెల వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టీ.ఎఫ్.టి.టి.డి.ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు జానీ మాస్టర్.

ఇవి కూడా చదవండి

 

ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. రామ్ చరణ్ దంపతులు నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.