మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో తన అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఇప్పుడు చరణ్ సినిమాల కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్య దాసుడే అని మరోసారి నిరూపించారు రామ్ చరణ్. గతంలో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్.. భార్య ఉపాసనతో కలిసి షాపింగ్ బ్యాగ్స్ మోస్తూ కనిపించారు. ఇక ఇప్పుడేమో ఉపాసన పాదాలను పట్టుకుని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
అసలు విషయానికి వస్తే.. రిలయన్స్ బాస్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ అధినేత వీరెన్ మర్చంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చంట్ పెళ్లి సందడి మొదలైంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ఈ వేడుక కోసం భారీగా ఖర్చు పెడుతుంది అంబాని ఫ్యామిలీ. ఈ వేడుక కోసం ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జామ్ నగర్ చేరుకున్నారు. బాలీవుడ్ నుంచే కాదు.. హాలీవుడ్ నుంచి కూడా ప్రీ వెడ్డింగ్‌కి హాజరవుతున్నారు. ఇక నిన్న శుక్రవారం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి జామ్ నగర్ వెళ్ళారు. అయితే అక్కడకు వెళ్తున్న సమయంలో ఫ్లైట్‌లో ఉపాసన పదాలు పట్టుకుని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నాడు మన గ్లోబల్ స్టార్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. మెగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసనను చూస్తుంటే.. “సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని.. ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని” సాంగ్ గుర్తుకువస్తుందని.. ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్య దాసుడే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చెర్రీని మాత్రం అమ్మాయిలు తెగ పొగిడేస్తున్నారు. భర్త అంటే ఇలా ఉండాలని.. చిరంజీవి గారి అబ్బాయిని చూసి నేర్చుకోవాలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరు అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం అంటున్నారు మెగా ఫ్యాన్స్.
ఉపాసన, రామ్ చరణ్ కాలేజీ ఫ్రెండ్స్. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు.. 2012 జూన్ 14న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసన. పెళ్లైన 11 సంవత్సరాలకు వీరికి పాప జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 20న మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెటింది. చిరంజీవి మనవరాలికి క్లీంకార అని నామకరణం చేశారు.
Upasana Vadhina Be like : Evarra Global Star 😂❤️❤️#RamCharan @AlwaysRamCharanpic.twitter.com/HEucaODSnN
— Hemanth RC ™ (@Hemanth_RcCult) March 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.