మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పనులు జరుపుకుంటున్నాయి. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. చరణ్ కెరీర్లో 15వ సినిమా.. దిల్ రాజుకు 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇక ఇదే సినిమా కోసం శంకర్ ఇటీవలే హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో నటించే నటీనటులను సెలక్ట్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం శంకర్, చరణ్ చిత్రాన్ని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్రూయనిట్ ప్లాన్ చేస్తుందట. ఇందుకోసం చరణ్ తన డేట్స్ కూడా సర్ధుబాటు చేసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నెలాఖరుకు పూర్తయ్యేట్టుగా సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత చరణ్.. శంకర్ ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నాడట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలోని ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రంలోనే చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించనున్నారు.
Also Read: