మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నారు జక్కన్న. ఇందులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా.. ఎన్టీఆర్… గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌తో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో జక్కన్న అండ్ టీం బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల పై నెట్టింట్లో కొత్త రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్ఆర్ఆర్ వాయిదా పడబోతుందంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం.. మరోవైపు ఓమిక్రాన్ వ్యాప్తి కూడా రోజు రోజూకీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ, ఇంకా పలు ఆంక్షలు విధించారు. అలాగే ప్రస్తుతం ఏపీలో టికెట్స్ రేట్స్ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో అమలు చేయడంతో సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయడం కన్నా… వాయిదా వేయడమే మంచిదని భావిస్తున్నారట మేకర్స్. భారీ బడ్జె్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ పై పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై హైప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇదే విషయాన్ని అటు రాజమౌళితో చర్చించేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. మరీ మరోసారి ఆర్ఆర్ఆర్ అభిమానులకు షాకిస్తుందా ? లేదా ? ముందుగా నిర్ణయించిన తేదీకే విడుదలవుతుందా ? అనేది చూడాలి.
Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..