AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: టీవీలోకి వచ్చేస్తున్నా రామ్ చరణ్ పెద్ది.. ఎక్కడ చూడొచ్చంటే

రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన పెద్ది సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీలోనూ అదరగొట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి రానుంది. అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు టీవీలో ప్రసారం కానుంది.

Peddi Movie: టీవీలోకి వచ్చేస్తున్నా రామ్ చరణ్ పెద్ది.. ఎక్కడ చూడొచ్చంటే
Peddi
Rajeev Rayala
|

Updated on: Oct 09, 2026 | 5:45 PM

Share

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు జీ తెలుగు మరో ఆసక్తికరమైన సినిమాతో సిద్ధమైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. క్రీడలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, పట్టుదలతో కూడిన ఈ చిత్రాన్ని టీవీలో చూసేందుకు ప్రేక్షకులకు మరో అవకాశం కల్పిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 11, ఆదివారం సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్దిలో గ్రామీణ వాతావరణం, క్రీడా నేపథ్యం, మనుషుల మధ్య ఉండే అనుబంధాలను ప్రధానంగా చూపించారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఓ యువకుడి ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది. ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం, కుటుంబంపై ప్రేమ, ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం వంటి అంశాలను కథలో మేళవించారు.

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రంలో ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇస్తూనే, క్రీడలకు సంబంధించిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పెద్దిలో రామ్ చరణ్ పోషించిన పాత్ర కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించేందుకు చేసే ప్రయత్నాలు, తన లక్ష్యం కోసం పడే కష్టం కథలో కీలకంగా ఉంటాయి. ఒకవైపు క్రీడా నేపథ్యంలోని పోటీలు, మరోవైపు కుటుంబం, బంధాలకు సంబంధించిన భావోద్వేగాలు కథనానికి ప్రత్యేకతను తీసుకొస్తాయి.

లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో ముందుకు సాగే వ్యక్తి ప్రయాణాన్ని తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడం ఈ సినిమా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. రామ్ చరణ్ అభిమానులతో పాటు స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించారు. వీరితో పాటు విలక్షణ నటుడు జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తంగా పెద్దిని ఇప్పుడు ఇంట్లోనే టీవీలో వీక్షించే అవకాశం రానుంది. ఈ సినిమా ఎలాంటి టీఆర్ఫీ సొంతం చేసుకుంటుందో చూడాలి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us