రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ హీరోయిన్గా సత్తా చాటుకుంది రకుల్. ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు.. నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట్లో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తనపై వస్తున్న రూమర్స్ చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. నా జీవితానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయం అయినా నేనే అందరితో పంచుకుంటాను. అంతేకానీ అనవసరంగా అసత్యాలను ప్రచారం చేయకండి అంటూ తెలిపింది రకుల్.
రకుల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నా చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నా దృష్టి అంతా వాటిపైనే ఉంది. అందుకే నా గురించి వచ్చే వదంతులను పట్టించుకునే తీరిక నాకు లేదు. ఇక నా జీవితం పట్ల నేను చాలా క్లారిటీగా ఉంటాను. నాకు సంబంధించిన ఏ విషయం అయినా ముందు నేనే చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. సన్నిహితులకు, స్నేహితులకు మేం ఇచ్చే ప్రాధాన్యత కూడా ఒకేలా ఉంటుంది. అలాగే ఇద్దరం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం… ఉదయాన్నే వ్యాయమం చేయడం వంటి కచ్చితంగా ఫాలో అవుతాం. మా ఇద్దరికీ మధ్య ఇన్ని కనెక్టింగ్ అంశాలు ఉన్నాయి. అందుకే మేం కనెక్ట్ అయ్యామని అనుకుంటున్నాం అన్నారు రకుల్.
Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!
RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం
Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!
Ramesh Babu: మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు గురించి ఈ విషయాలు తెలుసా..