Rakul Preet Singh : సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ వదులుకున్న రకుల్ ప్రీత్.. కారణం ఇదే..

|

May 30, 2021 | 11:26 PM

టాలీవుడ్ లో తక్కువ టైం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడు సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Rakul Preet Singh : సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ వదులుకున్న రకుల్ ప్రీత్.. కారణం ఇదే..
Rakul Preet
Follow us on

Rakul Preet Singh :

టాలీవుడ్ లో తక్కువ టైం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడు సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది. అలా స్టార్ హీరోల సరసన సినిమా ఛాన్స్ లు దక్కించుకొని టాప్ హీరోయిన్ గా మారిపోయింది ఈ పాలబుగ్గల సుందరి. మొన్నటివరకు ఈ అమ్మడుకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ ఈ మధ్య ఎందుకో అవకాశాలు సన్నగిల్లాయి. ఈ సమయంలోనే ఓ సీనియర్ హీరో సరసన రకుల్ కు ఛాన్స్ వచ్చిందంట. నందమూరి నటసింహం బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో  అన్న విషయం అందరికి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ శ్రుతి హాసన్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. గోపీచంద్ తెరకెక్కించిన క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన శృతికి మరో అవకాశం ఇవ్వాలని చూసాడు దర్శకుడు గోపి. కానీ ‘సలార్’ సినిమా కారణంగా డేట్లు కుదరడం లేదని ఆమె చెప్పిందట. ఈ నేపథ్యంలోనే రకుల్ ను సంప్రదించగా, హిందీ ప్రాజెక్టుల కారణంగా తాను బిజీగా ఉన్నానని తెలిపిందట. గతంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవి పాత్రలో క నిపించింది రకుల్. రకుల్ ఇప్పుడు నో చెప్పడంతో  ఇక ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో తర్జన భర్జనలు పడుతున్నారట దర్శక నిర్మాతలు. కథ పరంగా ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు అవసరమని తెలుస్తుంది. మరి బాలయ్య సరసన హీరోయిన్ గా ఎంపిక అవుతారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ ఆన్సర్ వైరల్ వీడియో : Renu Desai Viral video.

సోను సూద్ కాల్స్ ఎత్తలేక పనివాడు పరేషాన్..ఈ రాత్రి కి పగలకి తేడా లేకుండా పోయింది అంటూ ఆవేదన :sonu sood video.

Varun Tej: వ‌రుణ్ తేజ్‌ ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌ను భ‌లే తిప్పుతున్నాడే.. మీరూ ఇలా చేయ‌గ‌ల‌రేమో ఓసారి ట్రై చేయండి.