Rakul Preet Singh: నాకు అవి నేర్పింది వారే.. ఇప్పటికీ అవే ఫాలో అవుతున్నా.. రకుల్ ఆసక్తికర కామెంట్స్

|

Oct 23, 2024 | 4:35 PM

తెలుగులో ఈ అమ్మడు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు.

Rakul Preet Singh: నాకు అవి నేర్పింది వారే.. ఇప్పటికీ అవే ఫాలో అవుతున్నా.. రకుల్ ఆసక్తికర కామెంట్స్
Rakul Preet Singh
Follow us on

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఈ అమ్మడు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు. కానీ క్రేజ్ మాత్రం విపరీతంగా సొంతం చేసింది. తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది రకుల్ ప్రీత్.

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

ఇక ఈ అమ్మడు తెలుగులో వరుసగా రఫ్ , లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్, ఎన్.టి.ఆర్. కథానాయకుడు, మన్మధుడు 2, చెక్, కొండపోలం సినిమాలు చేసింది. వీటిలో లౌక్యం, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో సినిమాలు తప్ప మిగిలినవి నిరాశపరిచాయి. దాంతో తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. హిందీలోనూ అదే పరిస్థితి.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

రకుల్ చివరిగా భారతీయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన బాల్యం, ఫ్యామిలీ గురించి మాట్లాడారు. “నేను ఆర్మీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. నా తల్లి దండ్రులు నాకు చాలా నేర్పించారు. క్రమశిక్షణతోపాటు మరెన్నో గొప్ప విషయాలు నాకు నేర్పించారు. వాటివల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకొచ్చారు రకుల్. ఇతరులను గౌరవించడం, ఇచ్చిన మాట మీద నిలబడటం.. వంటి వాటిని నేను ఎప్పుడూ పాటిస్తుంటా”.. అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.