Rakul Preet Singh: అందాల రకుల్‌కు తెలుగులో అవకాశాలు తగ్గాయా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. మొన్నటివరకు వరుస సినిమాలతో హడావిడి చేసిన రకుల్ ఈ మధ్య కాస్త సైలెంట్ అయిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలో నటించి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేస్‌లో నిలబడింది. తెలుగు తమిళ్ బాషలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలో హీరోయిన్‌గా చేసింది రకుల్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2లో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది రకుల్. అలాగే హిందీలో ఈ అమ్మడు ఒకటి రెండు సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే రకుల్ ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఓటీటీ రంగంలోకి అడుగులు వేశారు. టాక్ షోస్, వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్దమయింది తెలుస్తోంది. హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఈ అమ్మడు ఓకే చెప్పిందట. ఇది కామెడీ జోనర్‌లో రూపొందే సీరీస్ అంటూ రకుల్ తాజాగా హింట్ ఇచ్చింది. త్వరలోనే ఇది ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :