Narakasura Movie: ‘నరకాసుర’ టీమ్‌ బంపరాఫర్‌.. ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూడొచ్చు.. ఎప్పటివరకంటే?

|

Nov 05, 2023 | 9:26 PM

పలాస సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రక్షిత్‌ అట్లూరి. అయితే ఆ సినిమా తర్వాత మరే మూవీ చేయలేదు. చాలా రోజులు గ్యాప్‌ తీసుకున్న రక్షిత్‌ ఇప్పుడు 'నరకాసుర' మూవీతో మన ముందుకు వచ్చారు. సెబాస్టియన్ నోవా అకోస్టా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ కథానాయికలుగా నటించారు

Narakasura Movie: నరకాసుర టీమ్‌ బంపరాఫర్‌.. ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూడొచ్చు.. ఎప్పటివరకంటే?
Narakasura Movie
Follow us on

పలాస సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రక్షిత్‌ అట్లూరి. అయితే ఆ సినిమా తర్వాత మరే మూవీ చేయలేదు. చాలా రోజులు గ్యాప్‌ తీసుకున్న రక్షిత్‌ ఇప్పుడు ‘నరకాసుర’ మూవీతో మన ముందుకు వచ్చారు. సెబాస్టియన్ నోవా అకోస్టా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ కథానాయికలుగా నటించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో కూడా ‘నరకాసుర’ రిలీజ్ అయింది. థియేటర్లలో రిలీజైన నరకాసుర సినిమాకు పాజిటివ్‌ రివ్యూస్‌ వస్తున్నాయి. ట్రాన్స్‌జెండర్ల బ్యాక్‌ డ్రాప్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో రక్షిత్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయంటున్నారు మేకర్స్‌. అలాగే ఇతర నటీనటుల అభినయం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందంటున్నారు. ఒక సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన నరకాసుర సినిమాను మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గర చేయాలనుకుంటున్నారు మేకర్స్‌. అందుకే సోమవారం (నవంబర్‌ 6) నుంచి గురువారం (నవంబర్‌ 9) వరకు అంటే సుమారు నాలుగు రోజుల పాటు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

‘నరకాసుర సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రక్షిత్‌ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకుల నుంచి అభినందనలతో పాటు మీడియ నుంచి కూడా మంచి రివ్యూస్‌ వస్తున్నాయి. మా సినిమాలో వున్న సందేశాన్ని మరింత మంది ఆడియెన్స్‌కు రీచ్‌ అవ్వాలనే సోమవారం నుంచి గురువారం వరకు ఒక టికెట్‌ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని సినిమా యూనిట్‌ వెల్లడించారు. ఈ సినిమాలో శత్రు, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాఫాల్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. నాని చామిడి శెట్టి సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించగా,  సీ.హెచ్. వంశీ కృష్ణ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.  మరి థియేటర్లలో ఓ మంచి సినిమాను చూడాలనుకునే వారికి నరకాసుర మంచి ఛాయిస్‌. పైగా ఒక ప్లస్‌ వన్‌ ఆఫర్‌.

ఇవి కూడా చదవండి

నరకాసుర మూవీ ప్రమోషన్లలో హీరో రక్షిత్ అట్లూరి..

విజయవాడ లో నరకాసుర చిత్ర బృందం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..