రాఖీ సావంత్ సీక్రెట్ పెళ్లి చేసుకుందా?
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు కనువిందు చేస్తుంటారు. 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఈ బొద్దుగుమ్మపై పదే, పదే రూమర్స్ హల్‌చల్ చేస్తాయి. తాజాగా రాఖీ సావంత్ ఒక ఎన్‌ఐఆర్‌ను రహస్యంగా పెళ్లిచేసుకున్నారని, ఈ వివాహం ఈనెల 28న జరిగిందని ప్రచారం చేశారు. ఈ వివాహానికి రాఖీ ఆప్తమిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే […]

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు కనువిందు చేస్తుంటారు. 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఈ బొద్దుగుమ్మపై పదే, పదే రూమర్స్ హల్‌చల్ చేస్తాయి. తాజాగా రాఖీ సావంత్ ఒక ఎన్‌ఐఆర్‌ను రహస్యంగా పెళ్లిచేసుకున్నారని, ఈ వివాహం ఈనెల 28న జరిగిందని ప్రచారం చేశారు. ఈ వివాహానికి రాఖీ ఆప్తమిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని టాక్.
అయితే దీనిపై రాఖీ క్లారిటీ ఇచ్చారు. తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేశారు. హోటల్‌లో బ్రైడల్ ఫొటోషూట్ జరిగిందని పేర్కొన్నారు. ‘జేడబ్యూ మారియట్ హోటల్‌లో బ్రైడల్ షూట్ జరిగింది. నాకు పెళ్లి జరిగిపోయిందని జనాలు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదు. నాకు వివాహం కాలేదు. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. నేను సింగిల్‌గా ఉన్నా’ అని చెప్పారు.