Deepika Padukone: ‘నేను అత్తమ్మనయ్యాను’.. దీపిక కూతురి కోసం దుబాయ్‌లో బొమ్మలు కొన్న ప్రముఖ హీరోయిన్.. వీడియో

|

Sep 11, 2024 | 1:44 PM

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తల్లి కావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 8న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దీపికా పదుకొణె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రణ్‌ వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

Deepika Padukone: నేను అత్తమ్మనయ్యాను.. దీపిక కూతురి కోసం దుబాయ్‌లో బొమ్మలు కొన్న ప్రముఖ హీరోయిన్.. వీడియో
Deepika Padukone
Follow us on

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తల్లి కావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 8న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దీపికా పదుకొణె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రణ్‌ వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీంతో ఈ సెలబ్రిటీ కపుల్ కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ కూడా దీపిక, రణ్ వీర్ దంపతులకు అభినందనలు తెలిపింది. ప్రస్తుతం రాఖీ సావంత్ దుబాయ్‌లో ఉంది. దీపికా పదుకొణెకు ఆడబిడ్డ పుట్టడంతో ఆమె చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు దుబాయ్‌లోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లి దీపిక కూతురి కోసం కొన్ని బొమ్మలు కూడా కొనుగోలు చేసింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ‘దీపికా, రణవీర్ సింగ్.. నేను అత్తమ్మ నయ్యాను. దీపికా పదుకొణె గుర్తుందా? ఇద్దరం కలిసి డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లాం. ఇద్దరం కలిసి సినిమా కెరీర్ ను ప్రారంభించాం. నవ్వు ఇప్పుడు స్టార్ హీరోయిన్ వి అయ్యావు. అలాగే తల్లివి కూడా అయ్యావు’ అని తన ఆనందాన్ని పంచుకుంది రాఖీ సావంత్.

రాఖీ సావంత్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన కొందరు నెటిజన్లు రాఖీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దేన్నైనా పబ్లిసిటీకి వాడుకోవడం రాఖీకే చెల్లిందంటూ నటిని దూషిస్తున్నారు. దయచేసి దీపిక కు దూరంగా ఉండండంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దుబాయ్ షాపింగ్ మాల్ లో బాలీవుడ్ నటి రాఖీ సావంత్..

 

అదే సమయంలో మరికొందరు నెటిజన్లు రాఖీ సావంత్‌కు అండగా నిలుస్తున్నారు. రాఖీ సావంత్‌ది పెద్ద మనసు. ఆమె అందరికీ ప్రేమను పంచుతుంది. కానీ ఆమెకు నిజమైన ప్రేమ లభించడం లేదు. రాఖీని ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

దీపిక, రణ్ వీర్ సింగ్ దంపతులు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.