Rajinikanth: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రండి.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు అందిన ఆహ్వానం

|

Jan 02, 2024 | 8:22 PM

జనవరి 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విశిష్ఠమైన కార్యక్రమానికి హాజరుకావాలని దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది.

Rajinikanth: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రండి.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు అందిన ఆహ్వానం
Rajinikanth
Follow us on

అయోధ్యలో రామ మందిర ఆలయంలో రామ్‌‌ లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం ముంచుకోస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విశిష్ఠమైన కార్యక్రమానికి హాజరుకావాలని దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. ప్రముఖ బీజేపీ నాయకుడు అర్జున మూర్తి రజనీకాంత్ ఇంటికి వెళ్లి రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని సూపర్‌ స్టార్‌ను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారాయన. రాముడి పట్టాభిషేకానికి రజనీకాంత్‌ ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాముడి వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. రజనీ కాంత్‌తో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, వ్యాపార దిగ్గజం రతన్‌ టాటాలకు కూడా ఆహ్వానం అందింది. వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.

అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం మెగాస్టార్‌ చిరంజీవి, ప్రభాస్‌ లకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అలాగే అమితాబ్, యష్, సన్నీడియోల్, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలి, రోహిత్ శెట్టి తదితరులు ఆహ్వానాలు అందుకున్న వారిలో ఉన్నారని తెలుస్తోంది. జనవరి 22న అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే రామాలయ ‘ప్రాన్‌ప్రతిష్ఠ’కు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన రామాలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పశ్చిమ దిశ), 250 అడుగుల వెడల్పు 161 అడుగుల ఎత్తులో ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గతంలో నివేదించారు.

ఇవి కూడా చదవండి

 

రజనీకాంత్ ను ఆహ్వానిస్తోన్న బీజేపీ నాయకులు

అమితాబ్ తో రజనీకాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి