
సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన నుంచి ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ ఎదురుచూపులు పులిస్టాప్ పడినట్టే కనిపిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ స్టైల్, యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. మొదటి షో నుంచి ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ప్రతి సినిమా రిలీజ్ సమయంలో హిమాలయాలకు వెళ్తూ ఉంటారు. మానసిక ప్రశాంత కోసం ఆయన హిమాలయాలకు వెళ్లి సాధువులతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో హిమాలయాలకు వెళ్తూ ఉంటారు రజినీకాంత్ . తాజాగా మరోసారి హిమాలయాలకు వెళ్లారు సూపర్ స్టార్.
జైలర్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన హిమాలయాలకు వెళ్లారని తెలుస్తోంది. అక్కడ కొద్దీ రోజులు గడిపిన తర్వాత తిరిగి చెన్నైకు రానున్నారు. ఇక జైలర్ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ మూవీలో రజినీకాంత్ ఒక పోలీస్ ఆఫర్స్ కు తండ్రిగా కనిపించనున్నారు. అలాగే ఓ సీక్రెట్ మిషన్ లో ఆయన పని చేస్తారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి ఈ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి .
Alapare dhan inime!!! See you at the theatre tomorrow for #Thalaivar dharisanam!! Book your tickets to #Jailer now on https://t.co/xsst5gdyzW pic.twitter.com/sqUARJrJBN
— AGS Cinemas (@agscinemas) August 9, 2023
The #Jailer Fever is everywhere & the audience verdict is already unanimous!!
Excited to watch Superstar @rajinikanth Garu in Action & his Hukum at the Box-office.All the best to the whole team @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu… pic.twitter.com/n1JpxOaL9N
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..