AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tortoise: ఈ సారి రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తుందే..

రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా “టార్టాయిస్”. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Tortoise: ఈ సారి రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తుందే..
Raj Tarun
Rajeev Rayala
|

Updated on: May 13, 2026 | 8:53 PM

Share

ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ మరియు మధుపాల మహా మూవీస్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు అలాగే మధుపాల సురేష్ గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం టార్టాయిస్. అయితే తాజాగా హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఇది కూడా చదవండి : Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

ఈ సందర్బంగా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ “ఈ రోజు మా హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు. మా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మా “టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ. రాజ్ తరుణ్ 25వ చిత్రం గా కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ మరియు హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో మంచి థ్రిల్లర్ చిత్రం ఇది.

ఇది కూడా చదవండి : సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

“హీరో కి నిద్రలో నడిచే అలవాటు ఉంది, నిద్రలో నడుచుకుంటూ వెళ్లి కొన్ని మర్డర్స్ చేస్తాడు.తర్వాత ఏమి జరుగుతుంది“ అనే కాసెప్ట్ తో ఈ చిత్రానికి చిత్రీకరించాం. షూటింగ్ అంత పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు రాజ్ తరుణ్ అభిమానులు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us