Rahul sipligunj: రాహుల్ సిప్లిగంజ్- హరిణ్యలతో టీమిండియా క్రికెటర్ చాహల్.. విషయమేమిటంటే?

టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. తన మనసుకు నచ్చిన హరిణ్యా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడీ కాబోయే దంపతులు టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తో కలిసి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Rahul sipligunj: రాహుల్ సిప్లిగంజ్- హరిణ్యలతో టీమిండియా క్రికెటర్ చాహల్.. విషయమేమిటంటే?
Rahul Sipligunj Sangeeth Party

Updated on: Nov 24, 2025 | 10:24 PM

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో తన జీవితంలో ఓ కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. హరిణ్యా రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారీ లవ్ బర్డ్స. ఇక ఇప్పుడీ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ నెల 27న రాహుల్- హరిణ్యారెడ్డిల వివాహం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స కూడా షురూ అయ్యాయి. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు కూడా సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు ముందస్తుగానే అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా తమ సంగీత్ వేడుకలో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. అదేంటంటే.. హరిణ్య కు టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ అంటే విపరీతమైన అభిమానమట. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ తన సంగీత్ వేడుకకు చాహల్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాడట. దీంతో హరిణ్య తెగ సంబరపడిపోయిందట. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. చాహల్, రాహుల్ లతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది హరిణ్య రెడ్డి. ఈ సందర్భంగా తనకు ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినందుకు రాహుల్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పింది. ఇది ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతుందంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది హరిణ్య.

ఇవి కూడా చదవండి

కాబోయే దంపతులో టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్..

ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి, క్రికెటర్ చాహల్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

సంగీత్ పార్టీలో సెలబ్రిటల సందడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.