Pooja Hegde: షూటింగ్ కు ఇప్పట్లో జాయిన్ అవ్వనంటున్న పూజ హెగ్డే.. ప్రభాస్ సినిమాకు చిన్న బ్రేక్

జిల్ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

Pooja Hegde: షూటింగ్ కు ఇప్పట్లో జాయిన్ అవ్వనంటున్న పూజ హెగ్డే.. ప్రభాస్ సినిమాకు చిన్న బ్రేక్
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది పూజ హెగ్డే. 

Updated on: Apr 21, 2021 | 6:43 AM

Radhe Shyam: జిల్ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధకృష్ణ. ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ మరోసారి రొమాంటిక్ పాత్రలో కనించబోతున్నాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ కు మిథున్ – మనన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా.. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. . అయితే కొన్ని రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతుందని అనుకుంటుండగా.. కరోనా సెకండ్ వేవ్ ఎంటర్ అయ్యింది. అయితే ‘రాధే శ్యామ్’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న కృష్ణంరాజు మరియు హీరోయిన్ పూజాహెగ్డే లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట. అయితే కోవిడ్ నేపథ్యంలో షూటింగ్ చేయడం కష్టంగా మారిందట. వయసు రీత్యా కృష్ణంరాజును ఒత్తిడి చేసే అవకాశం లేదు. అలానే పాండమిక్ కారణంగా పూజాహెగ్డే కూడా షూట్ కి రావడానికి నిరాకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన బుట్టబొమ్మ కరోనా పరిస్థితులు మారితే తప్ప షూట్ కి రాకపోవచ్చని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varm: టీడీపీకి నారాలోకేష్ అనే వైరస్ పట్టిందన్న ఆర్జీవీ.. దాని నివారణకు ఏకైక టీకా ఇదేనంటూ ట్వీట్

Tuck Jagadish: ఈ సినిమా కథ మొహమాటానికి వినేసి బాగోలేదని చెప్పేస్తే ఒక పనైపోతుంది కదా అనుకున్నా..కానీ

Mahesh Babu : మహేష్ బాబు -రాజమౌళి సినిమా పై ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..