Raashi Khanna: అలాంటి కథలకు దూరంగా ఉంటున్నా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రాశీఖన్నా..

Raashi Khanna: మద్రాస్‌ కేఫ్‌తో వెండితెరకు పరిచయమైన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

Raashi Khanna: అలాంటి కథలకు దూరంగా ఉంటున్నా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రాశీఖన్నా..
Raashi Khanna

Edited By:

Updated on: Apr 06, 2022 | 5:48 PM

Raashi Khanna: మద్రాస్‌ కేఫ్‌తో వెండితెరకు పరిచయమైన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా రాశిఖన్నా (Raashi Khanna) నటించిన తాజా సిరీస్‌ రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ ( Rudra: The Edge of Darkness). అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగా నటించిన ఈ బాలీవుడ్‌ క్రైమ్‌ డ్రామాలో అలియా చోక్సి అనే పాత్రలో నటించి మెప్పించింది రాశి. కాగా ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న ఈ సౌందర్య రాశి తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

కాపీ రైటర్ కాబోయి..

‘సినిమాల్లో మూస పద్ధతులను బ్రేక్‌ చేద్దామని అనుకుంటున్నాను. హీరోయిన్‌ అంటే.. పాటల కోసమో, రొమాంటిక్‌ సీన్స్‌ కోసమో ఉండకూడదు. ఇప్పటికే అలాంటి స్క్రిప్ట్‌లకు దూరంగా ఉంటున్నాను. చిత్రంలో నిడివి పది నిమిషాలు ఉన్నా సరే.. ఎఫెక్టివ్‌గా ఉండాలి. అందులో భాగంగానే రుద్ర వెబ్‌ సిరీస్‌ చేశాను. దీనికి ఇంత మంచి స్పందన వస్తుందని అసలు ఊహించలేదు. నేను పోషించిన అలియా చోక్సీ పాత్ర నన్ను మరో మెట్టు పైకి ఎక్కించింది. బాలీవుడ్‌లో నా జర్నీ కొనసాగుతుంది. తదుపరి సినిమాలో షాహిద్‌ కపూర్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్నాను. ఇక నా కెరీర్‌ విషయానికొస్తే.. నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. నిజానికి నేను కాపీ రైటర్‌ కావాలనుకున్నాను. డిగ్రీ పూర్తవ్వగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నాను. అయితే అంతలోనే మద్రాస్‌ కేఫ్‌ ఛాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్‌ ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్‌తో నా ముందుకొచ్చారు. కథ బాగుండడంతో కాదనలేకపోయాను. ఇక ఆ తర్వాత నా జర్నీ మీకు తెలిసిందే. నాకు ఆంగ్ల సాహిత్యమంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కవిత్వాలు రాస్తుంటాను.’నేనంటే నా జీన్స్‌ కొలతలు కాదు. నేనంటే వేయింగ్‌ మెషీన్‌ మీద అంకెలు కాదు. నేనంటే నా డిజైనర్‌ చిరునవ్వులూ కాదు. నేనంటే నా మనోబలం!’ అంటూ ఇటీవల తను రాసిన ఓ కవితను వినిపించింది రాశి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గోపీచంద్‌తో కలిసి పక్కా కమర్షియల్‌ చిత్రంలో నటిస్తోంది రాశి. దీంతోపాటు నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూ సినిమాలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుంది. వీటితో పాటు సర్దార్‌ (తమిళం), యోధా(హిందీ), షైతాన్‌ కా బచ్చా(హిందీ) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాలతార.

Also Read:RRR: పాన్‌ ఇండియా చిత్రాలకు ఆయనే కారణం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఆమిర్‌ ఖాన్‌ వ్యాఖ్యలు..

Ratan Tata: తగ్గేదే లే అంటున్న రతన్ టాటా.. చేతులెత్తేసిన అమెరికా దిగ్గజం..!

Corona Waves: దేశంలో కరోనా కొత్త వేవ్ విజృంభణ.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే