Folk Dancer : యూట్యూబ్ సంచలనం.. హీరోయిన్‌గా రాను బొంబాయికి రాను సాంగ్ డ్యాన్సర్.. హీరోగా బిగ్ బాస్ కంటెస్టెంట్..
ఇటీవల యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఫోక్ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఏకంగా 800 మిలియన్స్ కు పైగా వ్యూస్ అందుకుని సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించింది. అదే రాను బొంబాయికి రాను సాంగ్. ఈ పాట ఎంతగా హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో కనిపించిన రాము రాథోడ్, లిఖిత సైతం అదే స్తాయిలో ఫేమస్ అయ్యారు.

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అందులో రాను బొంబాయికి రాను ఒకటి. పల్లె పాటగా మొదలై ప్రపంచస్థాయికి చేరింది ఈ సాంగ్. దేశవిదేశాల్లో చిన్నా, పెద్ద ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. పాటతోపాటు.. అందులో స్టెప్పులేసిన డ్యాన్సర్స్ రాము రాథోడ్, లిఖిత సైతం అదే స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లోకి ప్రతి ఏటా ఎంతోమంది కొత్త ప్రతిభావంతులు పరిచయమవుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా, మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కోవలోనే, ఒకప్పుడు చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి ‘లిఖిత’ . ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
గతంలో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన “రాను నేను బొంబాయికి రాను..” పాటలో లిఖిత తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్ ఆమెకు వెండితెరపై గోల్డెన్ ఛాన్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ‘SAV3’ అనే కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ‘SAV3’ చిత్రం ద్వారా లిఖిత వెండితెరకు కథానాయికగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మరియు నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతున్నాయి. ఒక వినూత్నమైన కాన్సెప్ట్ , యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నట్లు సమాచారం. చిన్న డిజిటల్ స్క్రీన్ నుండి ఒక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలో మెయిన్ లీడ్‌గా అవకాశం రావడంపై లిఖిత ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..
ఈ సినిమాను దర్శకుడు కృష్ణ మాయ దర్శకత్వం వహిస్తుండగా.. సామ్రాట్, డీమోన్ పవన్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆదివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు. లిఖితకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆమె ఆల్రెడీ “రాను బొంబాయికి రాను” సాంగ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని సగటు ఆడియన్స్‌కు బాగా సుపరిచితం. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ పాపులారిటీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..
SAV3 సినిమా..

Sav3
ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..
