R. Madhavan : తమిళ హీరో మాధవన్.. తెలుగు ప్రేక్షకులకే కాదు… బాలీవుడ్‌కి పరిచయస్తుడే. సఖి, చెలి వంటి సినిమాలతో మాధవన్ లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించే మాధవన్. ప్రస్తుతంఅదే తరహాకథలను ఎంచుకుంటూసినిమాలు చేస్తున్నాడు. చాలా కాలాంతర్వత మాధవన్ నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. రీసెంట్ గా అనుష్క నటించిననిశ్శబ్దం సినిమాలోనెగిటివ్ పాత్రలోకనిపించి ఆకట్టుకున్నాడు. ఆర్ మాధవన్ కూడా గొప్ప గోల్ఫ్ ప్లేయర్ అని కొద్ది మందికి తెలుసు. మాధవన్ కు 7 భాషలు తెలుసు. తన కెరీర్‌లో 7 భాషా చిత్రాల్లో పనిచేసిన అతి కొద్ది మంది నటుల్లో మాధవన్ ఒకడు. అలాగే తాజాగా చిత్రపరిశ్రమలో మాధవన్ అందించిన సేవలకు గాను మహారాష్ట్రలోని కోల్హాపుర్ డీవై పాటిల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఈ పురస్కారం తనకు అందించడంతో మాధవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఇలాంటి పురస్కారం నాకు మరిన్ని వినూత్న పాత్రలు పోషించేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని మాధవన్ అన్నాడు. ఇక బాలీవుడ్ లో ‘3 ఇడియట్స్’ మూవీకి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. అలాగే ‘ఇన్ఫెర్నో’ అనే ఇంగ్లీష్ సినిమాలోకూడా నటించాడు మాధవన్. ప్రస్తుతం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
IPL 2021 Auction: ఐపీఎల్ 14వ సీజన్ ఆక్షన్‌లో స్పెషల్ అట్రాక్షన్… సందడి చేసిన స్టార్ కిడ్స్..