IPL 2021 Auction: ఐపీఎల్ 14వ సీజన్ ఆక్షన్‌లో స్పెషల్ అట్రాక్షన్… సందడి చేసిన స్టార్ కిడ్స్..
ఐపీఎల్ 14వ సీజన్ వేలం ఆసక్తికరంగా సాగింది. గురువారం జరిగిన ఈ వేలంలో ఆటగాళ్లను కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈసారి వేలంలో కొన్ని నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాయి...
IPL 2021 Auction : ఐపీఎల్ 14వ సీజన్ వేలం ఆసక్తికరంగా సాగింది. గురువారం జరిగిన ఈ వేలంలో ఆటగాళ్లను కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈసారి వేలంలో కొన్ని నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొందరు ఊహించినట్లుగా భారీ ధర పలకగా, మరికొందరు రికార్డు ధరతో షాకిచ్చారు. కాగా ఈ వేలం పాటలో ఈ సారి స్టార్ కిడ్స్ సందడి చేశారు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ సంయుక్త యజమానులుగా షారూఖ్ ఖాన్, జూహీ చావ్లా కొన్నాళ్లుగా కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.
కాగా ఈసారి షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, జూహీ చావ్లా కుమార్తె జాహ్నవి మెహతా హాజరయ్యారు. ఈ సారి వేలం పాట కోసం షారూఖ్, జూహ్లీలకు బదులు వారి పిల్లలు ఆర్యన్ ఖాన్, జాహ్నవి మెహతా హాజరై సందడి చేసారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ సహయజమానులతో కలిసి ఈ ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చున్న ఫోటోను జూహీ చావ్లా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోకి ‘కేకేఆర్ కిడ్స్ ఆర్యన్, జాహ్నవీలను ఆక్షన్ టేబుల్ దగ్గర చూడడం సంతోషంగా ఉందని’ రాసుకొచ్చింది జూహీ. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
So happy to see both the KKR kids, Aryan and Jahnavi at the Auction table .. ????? @iamsrk @KKRiders pic.twitter.com/Hb2G7ZLqeF
— Juhi Chawla (@iam_juhi) February 18, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :