AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: ఇదెక్కడి క్రేజ్ గురూ.. ఏకంగా పరీక్షలో కాంతార సినిమా గురించి ప్రశ్న..

కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400కోట్లకు పైగా వసూల్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

Kantara: ఇదెక్కడి క్రేజ్ గురూ.. ఏకంగా పరీక్షలో కాంతార సినిమా గురించి ప్రశ్న..
Kantara
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2022 | 6:32 PM

Share

సంచలనం అనే పదానికి సాలిడ్ ఉదాహరణ ఏదైనా ఉంది అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కాంతార  చెప్పాలి. కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఇప్పుడు పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400కోట్లకు పైగా వసూల్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ద‌క్షిణ క‌ర్ణాట‌క సంస్కృతి, సంప్రదాయాల్లో భూత్‌కోలా వేడుక‌లు చాలా ఫేమస్‌. ఈ నేపథ్యంలోనే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. కాంతారా చిత్రంలో ఈ వేడుకల్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు రిషబ్‌శెట్టి. విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది.

ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. తాజాగా కాంతారా సినిమా గురించి ఏకంగా పరీక్షల్లో కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంలో జరిగిన మిల్క్ ఫెడరేషన్ పరీక్షలలో కాంతార సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను కాంతార హీరోయిన్ సప్తమి గౌడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కినది అంటూ నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. జల్లికట్టు, భూత కోల, యక్షగాన, దమ్మామి అంటూ అప్షన్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Kantara

Kantara

Follow Us
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!