Vijay Deverakonda: విజయ్ దేవర కొండ సినిమాల పై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్..

హీరోగా పరిచయం కాక ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు విజయ్ దేవరకొండ. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విజయ్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయం సాధించింది.

Vijay Deverakonda: విజయ్ దేవర కొండ సినిమాల పై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్..
Pv Sindhu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 13, 2024 | 5:18 PM

తక్కువ టైం లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ ఎలా ఉన్నారో.. అలాగే ఓవర్ నైట్ లో స్టార్స్ అయినా కుర్ర హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు క్రేజీ హీరో విజయ్ దేవర కొండ. హీరోగా పరిచయం కాక ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు విజయ్ దేవరకొండ. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విజయ్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు విజయ్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు.

ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవర కొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో రానున్నాడు. ఈసినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ సినిమాల పై పీవీ సింధు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తాజాగా పీవీ సింధు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంట్రవ్యూలో ఆమె మాట్లాడుతూ.. విజయ్ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ దేవర కొండ అన్ని సినిమాలు తనకు నచ్చవు అని చెప్పింది పీవీ సింధు. విజయ్ సినిమాల్లో కొన్ని సినిమాలు మాత్రమే తనకు ఇష్టం అని తెలిపింది సింధు. అలాగే తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ప్రభాస్ తన క్రష్ అని తెలిపింది పీవీ సింధు. బ్యాడ్మింట‌న్ వల్ల వచ్చే స్ట్రెస్ తగ్గించుకోవడానికి సినిమాలు చూస్తానని.. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ అంటే తనకు ఇష్టమని తెలిపింది సింధు. ప్రతి హీరో తన సినిమా హిట్ అవుతుందనే నెలలు తరబడి షూటింగ్ చేస్తారు. కానీ వాటి రిజల్ట్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అందుకే వారి కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు అని తెలిపింది పీవీ సింధు.

పీవీ సింధు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by PV Sindhu (@pvsindhu1)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.