పాన్ ఇండియ పాపులర్ స్టార్స్ వీరే..మన తెలుగు హీరోల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?

పాన్ ఇండియ పాపులర్ స్టార్స్ వీరే..మన తెలుగు హీరోల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?

image

samatha 

01 february 2025

Credit: Instagram

 ఐఎండీబీ అనే సంస్థ పాన్ ఇండియా పాపులర్ స్టార్ హీరోగా ఎవరిని ఇండియన్ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు అని ఓ సర్వే నిర్వహించింది.

కాగా, తాజగా దానికి సంబంధించిన లిస్ట్‌ను ఆ సంస్థ విడుదల చేసింది.అందులో మన తెలుగు హీరోలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చూద్దాం.

పుష్ప2 సినిమాతో రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్స్ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచారు.

ఇక బాహుబళి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన మన రెబల్ స్టార్ 7వ స్థానానికి పరిమితం అయ్యారు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 8వ స్థానంలో ఉన్నారు. ఇటీవల ఆయన గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక దేవర సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ 23వస్థానంలో నిలిచారు.

మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా పాపులర్ స్టార్ లిస్ట్‌లో చాలా వెనకబడిపోయారు. 25 చివరిస్థానంలో ఉన్నారు.

ఇక రెండవ స్థానంలో షారూఖ్ ఖాన్,మూడవ స్థానంలో యష్, తర్వాత రణ్ బీర్ కపూర్, దేవ్ , జీత్, ప్రభాస్, విజయ్ హృతిక్ స్టార్స్ ఉన్నారు.

ఇక తెలుగు హీరోలు పాన్ ఇండియా పాపులర్ స్టార్ రేటింగ్‌లో వెనకబడిపోవడంతో తమ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.