Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: ఎవరండీ ఈయన.. శ్రీశైలంలో గోల్డ్ మ్యాన్ సందడి.. ఒంటిపై ఇన్ని కేజీల బంగారమా..?

Srisailam: ఎవరండీ ఈయన.. శ్రీశైలంలో గోల్డ్ మ్యాన్ సందడి.. ఒంటిపై ఇన్ని కేజీల బంగారమా..?

J Y Nagi Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2025 | 3:18 PM

పది గ్రాములు కాదు.. వంద గ్రాములు కాదు.. ఏకంగా కేజీల కొద్ది బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఓ భక్తుడు. చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్‌లెట్లు..… ఇక మెడలో అయితే అంతకుమించిన గోల్డ్‌ చైన్స్‌.. మొత్తంగా సుమారు 5 కేజీల బంగారం అతని ఒంటిపై ధగధగ మెరిసిపోతోంది. భక్తులు అతడ్ని ఆసక్తిగా చూశారు.

నంద్యాల జిల్లా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో గోల్డ్‌మ్యాన్‌ సందడి చేశారు. ఒంటిపై కిలోల కొద్ది బంగారు నగలతో కొండపై భక్తుల చూపు తనవైపు తిప్పుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత, గోల్డ్ మ్యాన్‌ కొండా విజయ్‌ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. విజయ్ ఒంటిపై సుమారు ఐదు కేజీల బరువు ఉన్న బంగారు ఆభరణాలు ఉన్నాయి. పెద్ద పెద్ద గొలుసులు, కంఠాభరణాలు, చేతికి కడియాలు ధరించారు.. మల్లన్న దర్శనానికి వచ్చిన విజయ్‌ను భక్తులు ఆసక్తిగా చూశారు. వామ్మో ఇంత బంగారమా అంటూ షాకయ్యారు. నగల దుకాణమే తరలివచ్చిందా అన్నట్టుగా బంగారు ధరించి వచ్చిన కొండా విజయ్‌ శ్రీశైలంలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి