
పుష్ప మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమాలో అద్భుతమైన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఈ సినిమాకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్పా -2 నిలిచింది. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.
సుకుమార్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. పుష్ప పార్ట్ -1 లో స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావ ఉహు అంటావా’ ఎంతటి సంచలనం నమోదు చేసిందో తెలిసిందే. ఈ పాటలో టాలీవుడ్ బ్యూటీ సమంత డాన్స్ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఈ నేపథ్యంలో రానున్న పుష్ప సెకండ్ పార్ట్ లో మరొక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసాడట సుకుమార్. అయితే ఇన్నిరోజులు ఈ సాంగ్ లో నటించబోయే భామ ఎవరంటూ చర్చ నడిచింది. శ్రద్ద కపూర్ పేరు వినిపించినా చివరకు అవేవి కాదని టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల ను ఫిక్స్ చేసాడు సుకుమార్.
కాగా ఈ స్పెషల్ సాంగ్ ను నవంబర్ 6 నుండి షూట్ చేసేలా ప్లాన్ చేసాడని సమాచారం. దాదాపు ఐదు రోజులు పాటు ఈ స్పెషల్ సాంగ్ ను తీయనున్నారు. ఇటీవల దేవర సినిమాలోని ఆయుధపూజ సాంగ్ ను కొరియోగ్రాఫ్ చేసిన బాలీవుడ్ ప్రముఖ మాస్టర్ గణేష్ ఆచార్య శ్రీలీల, బన్నీ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?
Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్ను చూస్తే షాకవ్వాల్సిందే..
Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.