Pushpa 2 Movie: పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్.. మామూలు ప్లాన్ కాదు ఇది..!

| Edited By: Janardhan Veluru

Jan 15, 2025 | 7:18 PM

పుష్ప 2 రిలీజై 40 రోజులు గడిచిపోయినా.. ఇంకా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు నిర్మాతలు నయా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ఈ సినిమాకు మరో వెర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆల్రెడీ 3.21 గంటలు ఉన్న నిడివికి మరో 20 నిమిషాలు కలిపి రీ లోడెడ్ వర్షన్ జనవరి 17న విడుదల చేస్తున్నారు.

Pushpa 2 Movie: పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్.. మామూలు ప్లాన్ కాదు ఇది..!
Pushpa 2 Reloaded
Follow us on

పుష్ప 2 ఫుల్ రన్ అయిపోయింది.. 40 రోజులైపోయింది.. ఇంక థియేటర్స్‌కు ఎవరు వస్తారు అనుకుంటున్నారేమో..? కానీ పుష్ప 2 నిర్మాతల ప్లానింగ్ మాత్రం మరోలా ఉంది. ఈ సినిమాకు మరో వెర్షన్ విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ 3.21 గంటలు ఉన్న నిడివికి మరో 20 నిమిషాలు కలిపి రీ లోడెడ్ వెర్షన్ జనవరి 17న విడుదల చేస్తున్నారు. మొదట్నుంచీ కూడా ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు, సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే మనం నిజంలోనే బతుకుతున్నామా లేదంటే ఏదైనా కల గంటున్నామా అనిపిస్తుంది. కలలో కూడా బాక్సాఫీస్ చూడని రికార్డులను పరిచయం చేసాడు పుష్ప రాజ్. మరీ ముఖ్యంగా నార్త్ బాక్సాఫీస్ బెండు తీసాడు.

పుష్ప బ్రాండ్ బాక్సాఫీస్‌ను కమ్మేస్తుందని తెలుసు కానీ కలలో కూడా ఊహించని విధంగా రికార్డులను చెల్లాచెదురు చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. బన్నీ పర్ఫార్మెన్స్‌కు అమితాబ్ బచ్చన్ మాత్రమే కాదు.. మొత్తం ఇండియా ఫిదా అయిపోయింది. ఇప్పటి వరకు 42 రోజుల్లోనే 1850 కోట్లు వసూలు చేయడమే కాక.. విడుదలైన 43వ రోజు కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది పుష్ప 2. కేవలం హిందీలోనే 850 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. జవాన్ తర్వాత సోలోగా హిందీలో 1000 కోట్లు గ్రాస్ వసూలు చేసిన సినిమా పుష్ప 2నే.

బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కూడా దాటేసింది పుష్ప 2. తెలుగు రాష్ట్రాల్లోనూ 230 కోట్లు షేర్ వసూలు చేసింది పుష్ప 2. ట్రిపుల్ ఆర్ మాత్రమే పుష్ప 2 కంటే ముందుంది. ఈ చిత్రం 272 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో రీ లోడెడ్ వర్షన్ విడుదల చేస్తున్నారు. అది కూడా టికెట్ రేట్ల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. సింగిల్ స్క్రీన్స్ 100 రూపాయలు, మల్టీప్లెక్స్‌కు 125 నుంచి 150 రూపాయల మధ్యలో రేట్ ఉంచేలా చర్చలు జరుగుతున్నాయి. జనవరి 17 నుంచి ఈ కొత్త వర్షన్ విడుదలవుతుంది. మరి ఈ ఐడియాతో 2000 కోట్ల క్లబ్బులో పుష్ప 2 చేరుతుందా లేదా అనేది చూడాలి.

పుష్ప 2 రీలోడెడ్ గ్లిమ్స్..