Puri Musings: జీవితంలో సగం గొడవలకు కారణం వాళ్లే.. మరో ఫిలాసఫీని వదిలిన పూరీ జగన్నాథ్..

|

Dec 10, 2022 | 11:34 AM

తాజాగా పూరి మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ లు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నో విభిన్న కాన్సెప్ట్ లను ప్రేక్షకులకు వినిపించిన ఆయన ఈసారి తడ్కా గురించి చెప్పారు. తడ్కా అంటే తాలింపు అని. జీవితంలో సగం గొడవలు దీనివల్లే అంటూ వివరణ ఇచ్చారు పూరి.. ఇంతకీ ఏం చెప్పారో తెలుసుకుందామా.

Puri Musings: జీవితంలో సగం గొడవలకు కారణం వాళ్లే.. మరో ఫిలాసఫీని వదిలిన పూరీ జగన్నాథ్..
Puri Jagannadh
Follow us on

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమా తర్వాత కాస్త విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. కానీ విజయ్ నటనకు మాత్రమే మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయ్యారు. తాజాగా పూరి మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ లు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నో విభిన్న కాన్సెప్ట్ లను ప్రేక్షకులకు వినిపించిన ఆయన ఈసారి తడ్కా గురించి చెప్పారు. తడ్కా అంటే తాలింపు అని. జీవితంలో సగం గొడవలు దీనివల్లే అంటూ వివరణ ఇచ్చారు పూరి.. ఇంతకీ ఏం చెప్పారో తెలుసుకుందామా.

“మనం ఒక మనిషిని ఇంకొ మనిషి దగ్గరికి ఏదో పని మీద పంపిస్తాం..అతను తిరిగొచ్చి ఏం జరిగిందో చెప్పడు. అవతలి వ్యక్తి ఏమన్నాడనేది తప్ప మిగిలినవన్నీ చెబుతాడు. ఏం జరిగింది ? అని అడిగితే.. మంచి రోజులు కావు.. నువ్వు ఎంత చేసినా మంచి ఫలితం ఉండదు. అతడు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. నువ్వు ఎంత చేశావు అతనికి.. నాలుగు డబ్బులు వచ్చేసరికి పొగరుగా మాట్లాడుతున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నా. వాడి మాటలు వింటే నువ్వు కొడతావు అంటూ చెబుతాడు. ఇదంతా కాదు.. ఆయన ఏమన్నాడో చెప్పు అని గట్టిగా అడిగితే డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు అంటూ తీరిగ్గా చెబుతాడు. అక్కడ పెనంలో ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకోచ్చేలోపోపు తాలింపు వేసి తీసుకొస్తారు. తాలింపు అంటే తడ్కా. జీవితంలో సగడం గొడవలు దీనివల్లే వస్తాయి. జరిగింది సూటిగా చెప్పారు. అసలు విషయం చెప్పకుండా తమ అభిప్రాయాన్ని చెప్పి.. అవతలి వాళ్లను విలన్స్ చేసేస్తాడు. తను ఎలా ఆలోచిస్తాడో.. మనల్ని కూడా నెట్టేసి మన మనసు మొత్తం పాడు చేసి పారేస్తారు. అందుకే మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా ? వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా ? అనే విషయాన్ని గ్రహించాలి. అందుకే డౌట్ వస్తే అడిగేయ్యాలి. నిజమే చెబుతున్నావా ?.. నువ్వు అనుకున్నది చెబుతున్నావా ? అని అడిగేయాలి. ఆ మధ్యవర్తులు మరెవరో కాదు. మనమే..

అందుకే ముందు జరిగింది మాత్రమే చెప్పాలి. అన్న మాటలే చెప్పాలి. ఆ తర్వాత అడిగితేనే మీ ఓపినియన్ చెప్పాలి. ప్రపంచంలో రోజూ ఈ తడ్కా వల్లే గొడవలు జరుగుతుంటాయి. అందుకే జరిగింది చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కరు తడ్కా స్పెషలిస్ట్. తడ్కా లేకుండా ఎవరు ఏ విషయం తీసుకురారు. మనవరకు చేరే ప్రతి వార్త తడ్కా పై తడ్కా. ఐదు తాలింపులు అయ్యాకా.. మరో వ్యక్తి జీడిపప్పు వేసి అరటి ఆకులో పొట్లం కట్టి తీసుకోస్తాడు. వాసన చూసి బాగుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అందుకే ఎప్పుడైనా జరిగిందే చెప్పాలి. జాగ్రత్తగా ఉండండి. దయచేసి తడ్కా తగ్గిద్దాం ” అంటూ చెప్పుకొచ్చారు పూరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.