నేను అలాంటి మహిళలతో ఉంటే ఎవరికీ ఏ సమస్య ఉండదు.. ఛార్మీతో ఉన్న రిలేషన్ పై పూరి

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు .

నేను అలాంటి మహిళలతో ఉంటే ఎవరికీ ఏ సమస్య ఉండదు.. ఛార్మీతో ఉన్న రిలేషన్ పై పూరి
Puri Jagannath, Charmi

Updated on: Oct 11, 2025 | 3:06 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ రీసెంట్ డేస్ లో కాస్త స్లో అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ ఘోర పరాజయం పాలైంది. ఆతర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు చిన్న గ్యాప్ తీసుకొని విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామ టబు కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే హీరోయిన్ గా సంయుక్తమీనన్ కనిపించనుంది. ఇదిలా ఉంటే పూరిజగన్నాథ్, ఛార్మీ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్..

బిగ్ బాస్ హౌస్‌లోకి అదిరేటి అందం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ..

పూరిజగన్నాథ్, ఛార్మీ కలిసి సినిమాలు చేస్తున్నారు. దర్శకుడిగా పూరి వ్యవహరిస్తుంటే.. ఛార్మీ నిర్మాతగా బాధ్యతలు చూసుకుంటుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమాకు కూడా ఛార్మి నిర్మతగా వ్యవహరిస్తోంది. తాజాగా తనతో ఛార్మీకి ఉన్న సంబంధం గురించి పూరిజగన్నాథ్ స్పందించారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. “నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఛార్మీ తెలుసు. గత 20 ఏళ్ల నుండి ఉన్న స్నేహంతో మేము కలిసి పని చేస్తున్నాము” అన్నారు పూరి జగన్నాథ్.

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. 27ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్

నేను  50 ఏళ్ల వయసున్న లేదా లావుగా ఉన్న మహిళతో కనిపిస్తే ఎవరికీ ఎటువంటి బాధ ఉండేది కాదు.. ఎలాంటి అనుమానాలు రావు. లేదా ఎవరైనా పెళ్లయిన మహిళతో ఉన్నా కూడా ఇక్కడ ఎవరికీ ఏ సమస్య ఉండదు. కానీ ఇక్కడ అందరి సమస్య ఏమిటంటే ఛార్మీ యంగ్.. పైగా ఆమెకు పెళ్లి కాలేదు. దానితో అందరూ మా మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మారండి. పైపై ఆకర్షణలు ఎక్కువ కాలం నిలబడవు. స్నేహం మాత్రమే శాశ్వతం.. అని పూరి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.