Puri Jagannadh: గ‌తంలో ఎన్నడూ ఎరుగ‌ని సిట్యూవేష‌న్.. ఇస్మార్ట్ డైరెక్టర్, ఏంటి మేట‌ర్

|

Jun 01, 2021 | 1:10 PM

పూరి కెరీర్లో అస‌లు ఇలాంటిది ఇంత‌కు ముందు ఎప్పుడైనా జ‌రిగిందా?  అస‌లు ఇలాంటి సిట్యూవేష‌న్ ఈ ఫాస్ట్ డైర‌క్ట‌ర్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? క‌రోనా వ‌చ్చి....

Puri Jagannadh:   గ‌తంలో ఎన్నడూ ఎరుగ‌ని సిట్యూవేష‌న్.. ఇస్మార్ట్ డైరెక్టర్, ఏంటి మేట‌ర్
Follow us on

పూరి కెరీర్లో అస‌లు ఇలాంటిది ఇంత‌కు ముందు ఎప్పుడైనా జ‌రిగిందా?  అస‌లు ఇలాంటి సిట్యూవేష‌న్ని ఈ ఫాస్ట్ డైర‌క్ట‌ర్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? క‌రోనా వ‌చ్చి ఇలా జ‌రిగింది కానీ, లేకుంటేనా? అని అంటోంది పూరి ఫ్యాన్ క్ల‌బ్‌. ఇంత‌కీ దేని గురించి ఈ డిస్క‌ష‌న్‌… తెలుసుకుందాం ప‌దండి.   ‘రేయ్ ఇస్మార్ నువ్వు తురుమ్‌రా’ అని రామ్ కోసం పూరి డైలాగు రాశారు కానీ, జ‌నాలు మాత్రం ఆ డైలాగ్‌ని పూరికి అప్లై చేసి చెప్పుకుంటున్నారు. ఆ మ‌ధ్య రాజ‌మౌళి చెప్పినా, రీసెంట్‌గా జ‌క్క‌న్న ఫాద‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పినా అవే మాట‌లు. కానీ వీళ్లంద‌రి కాన్ఫిడెన్స్ కి క‌రోనా చెక్ పెట్టేసిందా? అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది.

క‌రోనా ప్యాండ‌మిక్ క‌ట్ట‌డి చేయ‌కుండా ఉంటే పూరి గురించి ఇంకో ర‌క‌మైన డిస్క‌ష‌న్ ఉండేది ప్యాన్ ఇండియా రేంజ్‌లో. రౌడీ బోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఆయ‌న చేస్తున్న ‘లైగ‌ర్’ సినిమా ఈ పాటికే రిలీజ్ అయి ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో దిమ్మాక్ ఖ‌రాబ్ అవుతోంద‌ట పూరికి. లైగ‌ర్ సినిమా షూటింగ్ 60 ప‌ర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఒన్స్ అన్‌లాక్ అయితే బ్యాల‌న్స్ షూట్‌కి రెడీ అవుతున్నారు రౌడీ బోయ్‌. టూ ఇయ‌ర్స్ గా లాంగ్ హెయిర్ ప్ల‌స్ టోన్డ్ మ‌జిల్‌తో ఫైట‌ర్ లుక్‌లో తిరుగుతున్నారు డియ‌ర్ కామ్రేడ్‌. బాలీవుడ్ యంగ్ గ‌ర్ల్ అన‌న్య కూడా లైగ‌ర్‌తో సౌత్ ఎంట్రీ ఇవ్వ‌డానికి ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. విజ‌య్ కూడా ముంబై స‌ర్కిల్స్ లో ఈ మూవీ గురించి ఎప్పుడెప్పుడు మాట్లాడ‌దామా? ఎక్స్ పీరియ‌న్స్ షేర్ చేసుకుందామా అని వెయిటింగ్‌. లీడ్ ఆర్టిస్టుల వెయిటింగ్ ఇలా ఉంటే… పూరి మాత్రం ఎక్స్ ప్రెస్ స్పీడ్‌లో షూట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ కి జంప్ అవ్వాల‌ని ఓపిగ్గా చూస్తున్నారు.

Also Read: డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసిన‌ కేంద్రం

 జగన్ బెయిల్ రద్దు పిటిషన్​పై విచారణ వాయిదా.. కోర్టులో వాద‌న‌లు ఇలా ఉన్నాయి