Puri Jagannath: రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) స్కూల్ నుంచి వచ్చిన దర్శకుడుల్లో ఒకరు పూరీ జగన్నాథ్. తొలి చిత్రం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో బద్రి(Badri ) సినిమాను తెరకెక్కించారు.. ఫస్ట్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు. మహేష్ బాబు తో పోకిరి సినిమా తెరెకెక్కించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టించి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ వంటి సినిమాలతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో హిట్స్ అందుకున్నాడు పూరి. అయితే తనకు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించాడు. ఒకానొక సందర్భంగా ఆ అవకాశం కూడా అందుకున్నాడు. కానీ హఠాత్తుగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఆగిపోయింది. తాజాగా ఇదే విషయంపై పురీ జగన్నాథ్ తన మనసులో మాటని మళ్ళీ వ్యక్తం చేశాడు.
పూరీజగన్నాథ్ కలల ప్రాజెక్ట్‌గా ‘జనగణమన (జేజీఎం)’ త్వరలో పట్టాలెక్కనున్నదని అధికారికంగా ప్రకటించాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో విజయ్ దేవకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర యూనిట్ అధికారికంగా జనగణమన మూవీ గురించి ప్రకటిస్తున్న సందర్భంలో దర్శకుడు పురీ జగన్నాథ్ పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. అందులో భాగంగా.. మీరు చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు కదా… ఆ ప్రాజెక్ట్ ఏమైందని అడిగిన ప్రశ్నపై పురీ స్పందించారు.
తాను మెగాస్టార్ చిరంజీవికి కమర్షియల్ కథ చెప్పానని .. ఆ కథ చిరుకు కూడా నచ్చింది. అయితే ప్రస్తుతం చిరంజీవి సమాజానికి ఉపయోగపడేలా మెసేజ్ ఓరియెంటెండ్ సినిమాలు చేయాలనీ భావిస్తున్నారు. అందుకనే చిరంజీవి తో నా ప్రాజెక్ట్ చేజారిపోయిందని పురీ జగన్నాథ్ చెప్పారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవకొండ మాట్లాడుతూ.. పూరీ జగనాథ్ త్వరలో వెండి తెరపై నటుడిగా అడుగు పెట్టనున్నారని.. చిరంజీవి సినిమాలో నటించనున్నారని చెప్పాడు.
Also Read:
Ugadi 2022: ఉగాదిరోజున ఈ పనులు చేస్తే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం..