AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: క్రేజీ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్.. ఏకంగా చనిపోయిందంటూ పోస్ట్లు.. షాక్‌లో ఫ్యాన్స్

ముఖ్యంగా సినిమా స్టార్స్. రోజు రోజుకు సోషల్ మీడియా వేధింపులు ఎక్కువవుతున్నాయి. అసభ్యకరమైన పోస్ట్లు.. నీచమైన ట్రోల్స్ తో సినిమా తారలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు.

Actress: క్రేజీ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్.. ఏకంగా చనిపోయిందంటూ పోస్ట్లు.. షాక్‌లో ఫ్యాన్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2022 | 8:39 AM

Share

సోషల్ మీడియా ద్వారా ఎంత పాజిటివిటి ఉంటుందో అదే స్థాయిలో నెగిటివిటి కూడా ఉంటుంది.  సోషల్ మీడియా ద్వారా చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో పడి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సినిమా స్టార్స్. రోజు రోజుకు సోషల్ మీడియా వేధింపులు ఎక్కువవుతున్నాయి. అసభ్యకరమైన పోస్ట్లు.. నీచమైన ట్రోల్స్ తో సినిమా తారలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు. ఇక సదరు హీరోయిన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాక్ చేసి అసభ్యకరమైన పోస్ట్లు షేర్ చేస్తున్నారు మరికొందరు. ఇలా సోషల్ మీడియా వేధింపులకు చాలా మంది హీరోయిన్స్ బలయ్యారు. రీసెంట్ గా టాలీవుడ్ టీవీ ఆర్టిస్ట్, యాంకర్ విష్ణు ప్రియా ఫేస్ బుక్ కూడా హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు అశ్లీల పోస్ట్ లను షేర్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది.

ఈసారి ఏకంగా ఆ హీరోయిన్ చనిపోయిందని పోస్ట్ షేర్ చేశారు. దాంతో ఆ హీరోయిన్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్ చాలా సఫర్ అయ్యారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు. ప్రముఖ పంజాబీ నటి నికిత్ దిల్లోన్. ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యింది. నికిత్ ధిల్లాన్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో “మా ప్రియమైన కుమార్తె నికిత్ ధిల్లాన్ అకాల మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది. మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’ అంటూ ఆ పోస్టు చేశాడు.

ఇవి కూడా చదవండి

దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతూ పోస్ట్ లు, ఫోన్ కాల్స్, అలాగే చాలా మంది వాళ్ల ఇంటికి వెళ్లడం లాంటివి చేస్తున్నారు. దాంతో ఈ విషయం పై నటి స్పందిస్తూ.. చాలా భయంకరమైన పరిస్థితి అది. నా కుటుంబ సభ్యులు, నేను తీవ్ర మనోవేదన అనుభవించాం. ఇది పబ్లిసిటీ స్టంట్ కోసం అని కొంతమంది అంటున్నారు. కానీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. నా కుటుంబం మానసికంగా కుంగిపోయింది అంటూ చెప్పుకొచ్చింది నిఖిత్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.