AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Vishwa Prasad: ఆ 6 సినిమాలకు రూ.140 కోట్లు నష్టపోయానని బహిరంగంగా చెప్పిన నిర్మాత

ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్.. 2024లో ప్రొడ్యూస్ చేసిన ఆరు సినిమాలకు దాదాపు రూ140 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు వెల్లడించారు. ఓటీటీ మార్కెట్లో క్షీణత, నాన్-థియేట్రికల్ హక్కుల అమ్మకంలో వచ్చిన ఇబ్బందులు ఈ నష్టానికి ప్రధాన కారణాలని చెప్పారు. "ధమాకా" సినిమా మాత్రం లాభాలను తెచ్చిపెట్టిందని, మిగిలిన సినిమాలు నష్టాలను తెచ్చాయని వివరించారు. 

TG Vishwa Prasad: ఆ 6 సినిమాలకు రూ.140 కోట్లు నష్టపోయానని బహిరంగంగా చెప్పిన నిర్మాత
TG Vishwa Prasad
Ram Naramaneni
|

Updated on: Sep 18, 2025 | 4:46 PM

Share

ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన నిర్మాణ సంస్థకు 2024లో రూ.140 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇది ఆయన కెరీర్లో అతిపెద్ద నష్టంగా నిలిచిందని, ఆరు సినిమాల నిర్మాణంలో ఈ నష్టం వాటిల్లిందని వివరించారు. ఈ నష్టానికి ప్రధాన కారణం ఓటీటీ మార్కెట్ లో కనిపించిన మార్పులేనని ఆయన అభిప్రాయపడ్డారు. 2021-2023 మధ్యకాలంలో నాన్-థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ ఉండేది. అయితే, 2024కి వచ్చేసరికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి డిమాండ్ తగ్గడంతో సినిమాల నాన్-థియేట్రికల్ హక్కులను అమ్మడంలో ఎదురైన ఇబ్బందులే నష్టానికి కారణమని విశ్వ ప్రసాద్ వివరించారు. “ఈగల్”, “వడక్కుపట్టి రామసామి”, “మనమే”, “మిస్టర్ బచ్చన్”, “స్వాగ్”, “విశ్వం” వంటి సినిమాలు ఈ నష్టానికి కారణమైన చిత్రాలలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలన్నీ థియేట్రికల్ విడుదల పరంగా మంచి విజయాన్ని సాధించినప్పటికీ, ఓటీటీ హక్కుల అమ్మకం తగ్గడంతో లాభాలు సాధించలేకపోయాయని వివరించారు.

“ధమాకా” సినిమా మాత్రం 2024లో లాభదాయకంగా నిలిచిందని, అయితే ఇతర చిత్రాల నష్టాల నుంచి పూర్తిగా రికవరీ అవ్వలేదని విశ్వ ప్రసాద్ తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో సినిమాల విడుదల తేదీలను ఖరారు చేయడంలో వచ్చిన సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఓటీటీ సంస్థల క్యాలెండర్ ప్రకారం సినిమాలను విడుదల చేయాల్సి రావడం వల్ల నష్టాలు పెరిగాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఓటీటీ మార్కెట్ పరిస్థితులను బట్టి సినిమాల నిర్మాణం, విడుదలలను ప్లాన్ చేయాలని నిర్మాతలు అర్థం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్