
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2 తాండవం’ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి క్షణంలో పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కాగా అఖండ 2 బాటలోనే ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా కూడా వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాత విశ్వ ప్రసాద్ స్పందించాడు. అఖండ 2 చివరి క్షణంలో వాయిదా పడడం పై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై జరుగుతన్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు.
‘విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. థర్డ్ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మా సినిమా ‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై కూడా రూమర్స్ వచ్చాయి. ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను మేం ఇప్పటికే క్లియర్ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం. ‘అఖండ 2’తోపాటు డిసెంబరులో విడుదల కానున్న చిత్రాలు, 2026 సంక్రాంతికి రానున్న ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘జన నాయగన్’, ‘పరాశక్తి’ తదితర సినిమాల కోసం ఎదురుచూస్తున్నా. అన్నీ చిత్రాలు మంచి విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా‘ అని విశ్వ ప్రసాద్ ఆకాంక్షించారు.
It is unfortunate to see movies being stopped just before release and the impact it has on various others in the industry. Artists of the movie, small movie producers waiting to release their movies timing it with big movies.
The issue with the release of Akhanda 2 movie has…
— Vishwa Prasad (@vishwaprasadtg) December 6, 2025
It’s only getting bigger and bigger 😎🤙🏻#RebelSaab smashes 30 MILLION+ Views and turns into the MOST ADDICTIVE BANGER Trending at the Top on YouTube 🔥🔥
A @MusicThaman musical vibe 🎧
▶️ https://t.co/NhqOGQhuwv#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas pic.twitter.com/Ga9ovXaFbZ
— People Media Factory (@peoplemediafcy) December 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.